Home రాష్ట్ర వార్తలు నీళ్లున్నా..కన్నీళ్లే

నీళ్లున్నా..కన్నీళ్లే

  • భక్తరామదాసు మినహా మోక్షానికి నోచుకోని ప్రాజెక్టులు
  • ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జలదుఃఖం

Khammam Water Problemఖమ్మం: అపారమైన జల సంపదకు నిలయమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆది నుంచి వివక్ష కొనసాగుతోంది. అట్టహాసంగా శంకుస్థాపన చేయడం ఆ తర్వాత సరిగ్గా పట్టిం చుకోకపోవడం ఆనవాయితీగా వస్తుంది. గోదా వరి, కృష్ణా నదుల రెండింటి పరీవాహక ప్రాంతం ఈ జిల్లాల్లో ఉంది. గోదావరి నదితో పాటు కిన్నెర సాని, మున్నేరు, వైరా, కట్టలేరు, తాలిపేరుతో సహా అనేక చిన్న నదులు ప్రవాహిస్తున్నాయి. పాలకుల నిర్లక్షం కారణంగా ఇంకా సుమారు 10 లక్షల ఎకరాలు వర్షాధారం పైనా సాగు చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం జరగక పోవ డం, మొదలు పెట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. నాగా ర్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని 2.50 లక్షల ఎకరాలు, పాలేరు, వైరా, పెద్ద వాగు, లంకాసాగర్, తాలిపేరు, కిన్నెరసాని, నూకమామిడి మధ్యతరహా ప్రాజెక్టుల కింద మరో లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్నా వర్షాభావ పరిస్థితుల కారణంగా తాలిపేరు మినహా ఎక్కడ పూర్తిస్థాయిలో పంటలు సాగు చేయలేని పరిస్థితి. పైన పేర్కొన్న నదులపై అక్కడక్కడ ఎత్తిపోతల పథకాలు నిర్మించినా సాగునీరు లేక కొన్ని సాంకేతిక కారణాలతో మరికొన్ని పనిచేయడం లేదు. రెండు దశాబ్దాల కాలంలో భక్తరామదాసు ప్రాజెక్టు మినహా మరి ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదు.
పాలవాగు ప్రాజెక్టు : 10,132 ఎకరాల సాగు 40 గ్రామాలకు తాగునీరు అందించే లక్షంతో ఈ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. 2005-06లో పనులు ప్రారంభం కాగా 2008-09 ఆగస్టు మాసాల్లో ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం నాలుగు రెట్లు పెరిగింది. దశాబ్దా కాలం గడచినా ప్రాజెక్టు పూర్తి కాలేదు.
తాలిపేరు : సుమారు 25వేల ఎకరాలకు సాగునీరు అందించే తాలిపేరు ఆధునీకరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనుల నాణ్యతపై అనేక విమర్శలు వచ్చినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. గతంలో ప్రారంభించిన గుండ్లవాగు, మొండికుంట వాగు ప్రాజెక్టులు ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో ఉండగా వాటిదీ అదే పరిస్థితి. కిన్నెరసాని కాలువలను విస్తరించడం ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పనులు నిధుల కేటాయింపులు లేక నిలిచిపోయాయి.
జాలిమూడి ప్రాజెక్టు : వైరా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతుంది. 2014 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. కాలువల తవ్వకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజీవ్ సాగర్ స్థానంలో సీతారామ : దుమ్ముగూడెం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 4లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్షంతో 2005 డిసెంబరు 31న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ అంతర్గత పోరు కారణంగా ప్రాజెక్టు రెండు ముక్కలై ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్‌లుగా రూపాంతంరం చెందింది. ఈరెండింటిపై రూ.2వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఇందిరాసాగర్ నిర్మాణ స్థలం ఆంధ్రాలోకి వెళ్లింది. రాజీవ్‌సాగర్‌ను రీ డిజైన్ చేస్తూ సీతారామ పేరుతో కొత్త ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు. రూ.8వేల కోట్ల అంచనా వ్యయంతో 3.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 1.5 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరించేవిధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన జరగగా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటుంది ప్రభుత్వం. అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు దశాబ్దాలుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టడమే కానీ పూర్తయింది లేదు. గోదావరి నది ద్వారా వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుండగా జిల్లాలోని కృష్ణా ఉపనదులదీ అదే పరిస్థితి. వనరులున్నా పాలకుల నిర్లక్షం రైతన్నను కుంగదీస్తుంది. సాగునీరు లేక వర్షాలు సరిగా రాక ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తారనుకుంటే ఇప్పటికీ అదే నిర్లక్షం కొనసాగుతూంది. ఇప్పటికైనా జిల్లాల్లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతాంగం కోరుతుంది.