Home ఖమ్మం ప్లాస్లిక్‌పై నిషేధం కోసం కలెక్టర్ దంపతుల సైకిల్ సవారీ

ప్లాస్లిక్‌పై నిషేధం కోసం కలెక్టర్ దంపతుల సైకిల్ సవారీ

Collector couple

 

మన తెలంగాణ/ఖమ్మం: జాతిపిత మహాత్మాగాంధి 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్‌ను నిషేధించబోతున్న తరుణంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం ఖమ్మం నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన 5కె సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తోపాటు ఆయన సతీమణి జెడ్పీ సిఇవో ప్రియంక కర్ణన్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్డు, మమత ఆసుపత్రి రోడ్డు మీదుగా లకారం మినీ ట్యాంక్‌బండ్ వరకు చేరింది. కలెక్టర్ దంపతులతోపాటు అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, ట్రైనీ ఐఎఎస్ అధికారి, మున్సిపల్ కమిషనర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాను ప్లాస్టిక్ ఫ్రీగా సంపూర్ణంగా మార్చేందుకు ప్రజలు స్వచ్చంధంగా ముందుకు రావాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

Khammam Collector couple bicycle ride for ban on plastic