Home ఖమ్మం ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

Khammam Municipal Corporation Reservations Finalizedఖ‌మ్మం : ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఎన్నికల సంఘం  ఖ‌రారు చేసింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 60 డివిజ‌న్ల‌కు సంబంధించిన రిజ‌ర్వేష‌న్ల జాబితాను గురువారం ఉదయం విడుద‌ల చేశారు. 1, 8 డివిజ‌న్లు ఎస్టీ జ‌న‌ర‌ల్, 32వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించారు. 22, 42, 59 డివిజ‌న్ల‌ను ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 40, 43, 52, 60 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు, 28, 29, 30, 33, 34, 38. 46, 47, 48, 57 డివిజ‌న్లను బీసీ మ‌హిళ‌ల‌కు, 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 డివిజ‌న్ల‌ను బీసీ జ‌న‌ర‌ల్‌కు, 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 డివిజ‌న్ల‌ను జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు, 3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41. 45. 49. 50 డివిజ‌న్ల‌ను జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు కేటాయించినట్టు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఎన్నికల్లో బాగంగా  రిటర్నింగ్‌ అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ కూడా ఇప్పటికే ఇచ్చామని, త్వరలోనే ఓటరు తుది జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా డివిజన్ల వారీగా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.