Saturday, April 20, 2024

రెండు పాటలు మినహా పూర్తి

- Advertisement -
- Advertisement -

Khiladi is complete except for two songs

 

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News