Home తాజా వార్తలు రజనీకి జోడీగా ఖుష్బూ

రజనీకి జోడీగా ఖుష్బూ

Khushboo

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన సీనియర్ బ్యూటీ ఖుష్బూను హీరోయిన్‌గా తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో రజనీ భార్యగా ఖుష్బూ నటిస్తోందట. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి సౌతిండియా సూపర్‌స్టార్ సరసన ఈ లేట్ వయసులో ఏ రేంజ్ రొమాన్స్ చేస్తోందో చూడాలి. ఇక రజనీ గత సినిమాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావు, ‘పేటా’లో సిమ్రాన్‌తో కలిసి నటించారాయన. ఇప్పుడు ఈ చిత్రంలో ఖుష్బూతో జోడీ కడుతున్నారు. అన్నట్టు గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్ సినిమాలు చేశారు.ఇక రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రజనీతో రోబో, పేట సినిమాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Khushboo is acting as Rajinikanth wife role