Home తాజా వార్తలు కథకు అనుగుణంగానే ఆ సీన్స్

కథకు అనుగుణంగానే ఆ సీన్స్

 

ప్రస్తుతం బాలీవుడ్‌లో అప్ కమింగ్ హీరోయిన్‌గా కియారా అద్వానీ మంచి గుర్తింపు దక్కించుకుంది. భవిష్యత్తులో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్తుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు సిద్దం అవుతున్న ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన కియారా అద్వానీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ’కబీర్ సింగ్’ చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బోల్డ్ పాత్రల్లో నటించేందుకు, ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా నటిస్తున్న కియారా అద్వానీ తాజాగా మాట్లాడుతూ “కబీర్ సింగ్ చిత్రంలో నేను అమాయకత్వంతో కూడిన అమ్మాయిగా నటించాను. ఇందులో లిప్‌లాప్ సీన్స్ కూడా కథకు అనుగుణంగానే ఉంటాయి. యూత్‌కు ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుంది. ముద్దు సీన్లలో నేను సహజంగా నటించాను. ‘కబీర్ సింగ్’ చిత్రం నా కెరీర్‌లోనే ఓ స్పెషల్ మూవీగా నిలుస్తుంది”అని అన్నారు.

kiara advani open on lip lock scenes