Home ఆదిలాబాద్ చిన్నారి ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం

చిన్నారి ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం

Kid-Diedనార్నూర్ : వైద్యుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారిని చిన్నారి ప్రాణాలను బలిగొంది. మండలంలోని ధాబా-బి గ్రామానికి చెందిన మహాత్మే నిహారిక (3) మలేరియాతో బాధపడుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి యశ్వంత్ తెలిపిన వివరాల ప్రకారం నిహారిక గత నాలుగు వారాలుగా జ్వరంతో బాధపడుతుందని వైద్యం కోసం గత మూడు వారాల క్రితం ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకువెల్లడం జరిగిందన్నారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మలేరియా అని నిర్ధారించారు. 2 వారాలు రిమ్స్‌లోనే ఉండి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచించగా అక్కడే వైద్యం చేయించామని సరైన సమయంలో అధికారులు పట్టించుకోక పోవడం వల్లే నిహారిక మృతి చెందిందని తెలిపారు. ఏది ఏమైన వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైంది.