Home Default ఎమ్మెల్యే కౌసర్‌కు బెదిరింపులు..

ఎమ్మెల్యే కౌసర్‌కు బెదిరింపులు..

మనతెలంగాణ/హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి కార్వాన్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వెంటనే ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దిన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… కార్వాన్ ఎమ్మెల్యే, ఎంఐఎం పార్టీకి చెందిన కౌసర్ మొయినుద్దిన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తమకు రూ.50లక్షలు ఇవ్వకుంటే నీ కుమారుడిని కిడ్నిప్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kidnap Threats to Karwan MLA Kausar Mohiuddin