Friday, March 29, 2024

కిడ్నీరాళ్ల సమస్యకు సకాలంలో చికిత్స మేలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో ఏటా 12 శాతం మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో సతమతమవుతున్నారు. మూత్ర పిండాల నుండి మూత్రాశయం వరకు తరచుగా మూత్రం కేంద్రీకృతమై ఉన్నప్పుడు రాళ్లు ఏర్పడతాయి. ఖనిజాలు స్ఫటికీకరణ కలిసి ఉంటాయి. ఈ రాళ్లను సకాలంలో గుర్తిస్తే శాశ్వత నష్టం జరగకుండా ఉంటుంది. ఈ రాళ్లు పోడానికి మందులు తీసుకోవడం, నీళ్లు తాగడం చేస్తుంటారు. అయితే మూత్రనాళంలో రాళ్లు పేరుకుపోయినా, ఇన్‌ఫెక్షన్‌తో సంబంధం కలిగి ఉన్నా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. మూత్ర పిండాలు పొత్తి కడుపు పై భాగంలో వెనుకవైపు ఉంటాయి. రక్తం నుంచి వెలువడే వ్యర్థాలు, ద్రవాన్ని వడపోయడానికి మూత్ర పిండాలు ఉపయోగపడతాయి. ఆ విధంగా వచ్చే మూత్రం మూత్రాశయం నుంచి నాళాల ద్వారా బయటకు వెళ్తుంది. కిడ్నీ రాళ్లు ఉన్నాయనడానికి కొన్ని లక్షణాల వల్ల గమనించవచ్చు.

పక్కటెముకల కిందివైపు, వెనుకభాగంలో తీవ్రమైన నొప్పి ఉండడం, ఊదా, ఎరుపు రంగులో మూత్ర ం రావడం, దుర్గంధం, వాంతులు, వికారం పుట్టడం, నిరంతరం మూత్ర విసర్జన, ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టయితే జ్వరం, చలిగా ఉండడం, ఇవన్నీ కిడ్నీ రాళ్లు ఉన్నాయనడానికి లక్షణాలు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఒక కారణమంటూ ఉండదు. అనేక కారణాలు దీనితో ముడిపడి ఉంటాయి. కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి వీ మూత్రం లోని ద్రవం కరిగించగలిగితే రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో స్ఫటికాలు ఒకదానితో ఒకటి అంటుకోకుండా నిరోధించే పదార్ధాలు లేకపోవచ్చు. అలాంటప్పుడు రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తుంది. సాధారణంగా ఈ రాళ్లు కాల్షియం , కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఆక్సలేట్ అనేది ఆహారంలో సహజంగా లభించే పదార్థం. కాలేయం ద్వారా ప్రతిరోజూ చేయబడుతుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, చాక్లెట్లలో అధికంగా ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ డి అధికశాతం ఉన్న ఆహార కారకాలు, పేగు, బైపాస్ సర్జరీ, అనేక జీవక్రియ రుగ్మతలు మూత్రంలో కాల్షియం లేదా ఆక్సలేట్ సాంద్రతలను పెంచుతుంటాయి.

కాల్షియం రాళ్లు కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కూడా సంభవించవచ్చు. అలాగే మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్ కారణంగా స్ట్రువైట్ రాళ్లు ఏర్పడతాయి. ఇవి వేగంగా పెరిగి పెద్దవవుతుంటాయి. తగినంత ద్రవాలు తాగని వారిలో, ఎక్కువ ద్రవాలను కోల్పోయిన వారిలో యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడతాయి. అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకున్న వారిలో ఏర్పడవచ్చు. కొన్ని జన్యుపరమైన అంశాలు కూడా యూరిక్ యాసిడ్ రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఊబకాయం ఉన్నవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, ఇన్ఫమేటరీ ప్రేగు వ్యాధి, లేదా దీర్ఘకాలిక విరేచనాలు, జీర్ణప్రక్రియలో మార్పులకు కారణమవుతాయి. ఇది కాల్షియం, నీటిని శోషణను ప్రభావితం చేస్తుంది. మూత్రంలో రాళ్లు ఏర్పడే పదార్ధాల స్థాయిని పెంచుతుంది. అలాగే మూత్ర పిండ గొట్టం తాలూకు అసిడోసిస్, సిస్టిసూరియా, హైపర్సారాథైరాయిడిజం, కొన్ని మందులు, కొన్ని యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. వంశపారంపర్య రుగ్మత ఉన్నవారిలో సిస్టీస్ రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల మూత్రపిండాలు కొన్ని అమైనో ఆమ్లాలను ఎక్కువగా విసర్జించేలా చేస్తాయి.
వ్యాధి నిర్ధారణ
కిడ్నీ రాళ్లు ఉన్నాయని యూరాలజిస్టు అనుమానిస్తే రక్తపరీక్ష, మూత్రపరీక్ష, ఇమేజింగ్ టెస్ట్ వంటి పరీక్షలు చేస్తారు. శస్త్రచికిత్స అవసరమైతే రెట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ, హోల్మియమ్ లేజర్తో యురేటిరో రెనోస్కోపిక్ లిథోట్రిప్సీ, పెర్యులేనియస్ నెప్రోస్టోలిథోటమీ, ఎక్సాకార్బోరియల్ షాక్‌వేస్ లిథోట్రిప్సీ వంటి శస్త్రచికిత్సలు చేస్తారు. కిడ్నీ రాళ్ల పరిమాణం 2 సెంమీ కంటే ఎక్కువ ఉంటే పిసిఎన్‌ఎల్ శస్త్రచికిత్స ఉత్తమ చికిత్సగా భావిస్తారు. 2 సెంమీ కంటే తక్కువ ఉంటే ఆర్‌ఐఆర్‌ఎస్ శస్త్రచికిత్స ఉత్తమ చికిత్సగా ఎంపిక చేస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News