Saturday, March 25, 2023

హత్యలుచేసి ఆత్మహత్యకు యత్నం

- Advertisement -

police2

*ఇద్దరు మహిళలు, బాలిక హత్య కేసులో నిందితుడు మధు లొంగుబాటు

మన తెలంగాణ/ -శేరిలింగంపల్లి : హైదరాబాద్ చందానగర్‌లో కలకలం రేపిన ముగ్గురి హత్యల కేసులో నిందితుడు మధు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన భార్యను ఫోన్‌లో తరచూ వేధిస్తుండడంతో సహజీవనం చేసే అపర్ణతో సహా ఆమె తల్లి ని, కూతురుని హతమార్చాడు. మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్ రాంచంద్రాపురం ఎసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితున్ని ప్రవేశపెట్టారు. నిందితు డు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 26వ తేదీన అపర్ణ మధు భార్య యామినికి ఫోన్ చేసి విపరీతం గా తిట్టడంతో వాటిని రికార్డు చేసిన యామిని రాత్రికి ఇంటికి వచ్చిన భర్త మధుకు వినిపించింది. ఈ నెల 27వ తేదీన శనివారం చందానగర్ వేముకంట గౌతమీనగర్‌లోని సాయికుషల్ అపార్ట్‌మెంట్‌కు మధ్యాహ్నం 12.40 గంటలకు చేరుకున్నాడు. అప్పుడు ఇంట్లో ఉన్న అపర్ణ తల్లి విజయలక్ష్మితో ఫోన్ కాల్ విషయంపై గొడవ జరిగిందని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మధు అత్త విజయలక్ష్మిని గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడింది.  వెంటనే చున్నితో మెడను బిగించి ఊపిరి ఆడకుండ చేసి చంపేశాడు. అంతలోనే నాలుగేళ్ళ పాప కార్తీకేయ అమ్మమ్మను కొడతావా అంటూ లాగుతుండగా ఆమెను కూడా బలంగా కొట్టి అదే చున్నితో మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం ఆ రెండు మృతదేహాలను మంచంపై పడుకోబెట్టి అపర్ణ వచ్చే సమయానికి ఏమీ జరగనట్టు ఉండాలనే పథకం వేశాడు.  చనిపోయిన పసిపాప నోట్లో పాలడబ్బాను పెట్టి ఒకవైపు పడుకోబెట్టి విజయలక్ష్మిని కూడా అలాగే పడుకోబెట్టి టీవీ చూస్తూ కూర్చున్నాడు. చందానగర్ బజాజ్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అపర్ణ మధ్యాహ్నం 2.45 గంటలకు షోరూం నుంచి  భోజనానికి ఇంటికి వచ్చింది.  అప్పటికే టీవీ చూస్తున్న మధు గమనిస్తుండగా ఫ్రిజ్‌లో నీళ్ళబాటిల్ తీయబోయింది. అంతలోనే ఆ ఫోన్‌కాల్ విషయంపై గొడవపడగా అపర్ణను మధు కొట్టాడు. దాంతో ఆమె అతని వేళ్ళను బలంగా కొరికింది. వెంటనే వెనకాల ఉన్న రోకలిబడ్డను తీసుకొని తల వెనుక భాగంలో అనేక మార్లు కొట్టాడు. దాంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. చనిపోయిందని నిర్ధారించుకున్న  తర్వాత ఇంటికి తాళం వెళ్ళాడు. అనంతరం ఆదివారం ఉదయాన్నే మధు ఓ పదునైన కత్తిని తీసుకొని దాంతో పాటు ఒక కెమికల్ మందును తీసుకొని ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని పటాన్ చెరువులోని గణపతి లాడ్జీలో రూం అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం కత్తితో తన రెండు చేతుల నరాలను కోసుకొని తను తెచ్చుకున్న కెమికల్‌ను తాగగా అతనికి రాత్రంతా స్పృహలేకుండా పడిపోయాడు. సోమవారం ఉదయం లేచి చూడగా తాను బతికేఉన్నానని నిర్దారించుకున్నాక అప్పటికే ఈ హత్యలకు సంబంధించిన సమాచారం టీవీలో చూసి  చందానగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపొయినట్లు డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. యామిని పెట్టే బాధలు బరించలేక తరచు గొడవలు జరుగుతుండడంతో వీరిని అంతమొంధించాలని  నిర్ణయించుకొని వీరిని హత్య చేసినట్లు విలేకరుల సమావేశంలో మధు తెలిపాడు. చిన్న పిల్లతో కూడా ఫోన్ తిట్టించేవారని అందుకే ఆమెను కూడా హత్య చేశానన్నాడు. ఆధారాలను సేకరించారమని, సీసీ కెమెరాలలో ఇతను వచ్చి హత్యలు చేసి హెల్మెట్ ధరించి వెళ్ళినట్లు ఉన్నాయన్నారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు, సీఐ తిరుపతి రావు, రాంచందర్‌రావు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News