Home జాతీయ వార్తలు బిఎస్‌ఎఫ్ జవాన్‌ను చంపి గొంతు కోసిన పాక్ బలగాలు

బిఎస్‌ఎఫ్ జవాన్‌ను చంపి గొంతు కోసిన పాక్ బలగాలు

PHH

జమ్ము/న్యూఢిల్లీ: జమ్ము సమీపంలో ని అంతర్జాతీయ స రిహద్దులో భారత సరిహద్దు బలగం(బిఎస్‌ఎఫ్) జవానును పాకిస్థాన్ బలగాలు ప్రాణాంతకంగా కాల్చి,  ఆ తర్వాత గొంతుకోసేసాయని బుధవారం అధికారులు తెలిపారు. ఈ ఘోర ఘటన రామ్‌గఢ్ సెక్టార్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దీంతో అం తర్జాతీయ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్‌ను ప్రకటించడమే కాకుం డా, వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ రేంజర్లకు ఫిర్యాదు చేశాయి. ఇండోపాక్ సరిహద్దు నుంచి స్వాధీనం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ నరేందర్ కుమార్ పార్థీవ శరీరంలో మూడు బుల్లెట్ గాయాలు, మెడ కోసివేయడం కనుగొన్నారు. అంతర్జాతీయ సరిహద్దులో బహుశా ఇదే తొలి ఘోర ఘటన కావచ్చని భద్రతా అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులో కంచె ఉన్న ప్రాంతం లో విధులు నిర్వహిస్తున్న జవాను కనపడకుండా పో యాడని మంగళవారం ఉదయం 10.40 గంటలకు మొదటిసారిగా భారత సైన్యం గుర్తించిందని తెలిపారు.ఈ విషయాన్ని ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మిలిటరీ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్(డిజిఎంఒ) తీవ్రంగా తీసుకున్నారు. పాకిస్థాన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే జమ్ము వద్ద భారతపాక్ సరిహద్దులో చొరబాట్లు జరగకుండా ఉండేలా స్మార్ట్ టెక్నాలజీ, పరికరాలతో ‘స్మార్ట్ కంచె’ ప్రాజెక్టును సోమవారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకుంది.