Home ఛాంపియన్స్ ట్రోఫీ పంజాబ్‌కు మరో విజయం

పంజాబ్‌కు మరో విజయం

89 పరుగులతో అజేయంగా డివిలియర్స్..
ఆమ్లా అర్థశతకం, రాణించిన మ్యాక్స్‌వెల్
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో బెంగళూరు మ్యాచ్

Punjab

ఇండోర్ : ఐపిఎల్ 10 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో పుణె జట్టుపై విజయం సాధించి బోణీ కొట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు నిర్దేశించిన 149 పరుగుల లక్ష ఛేదనలో మ్యాక్స్‌వెల్‌సేన 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఇండోర్ వేదికగా సోమవారం ఇక్కడ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 33 బంతులు మిగిలిఉండగానే 14.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కింగ్స్ ఎలెవన్ 150 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమ్లా (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో 58 పరుగులతో అర్థ శతకం, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్)తో 43 పరుగులతో అద్భుతంగా రాణించ డంతో పంజాబ్‌కు విజయాన్ని సొంతం చేసుకుంది.

తొలుత ఓపెనర్‌గా దిగిన మనన్ వోహ్రా (34) పరుగులకే చేతులేత్తేశాడు. బెంగళూర్ బౌలర్ తైమా ల్ మిల్స్ బౌలింగ్‌లో వోహ్రా ఎల్‌బిడబ్లుగా ఔటై తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. అక్సర్ పటేల్ (9) పరుగులకే చాహల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వేదికగా సోమవారం ఇక్కడ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లుగా తాత్కాలిక కెప్టెన్ షేన్ వా ట్సన్, విష్ణు వినోద్ బరిలోకి దిగారు. మునపటిలా మ్యాచ్‌లో జట్టును ఆదుకుంటాడనుకుంటే ఈ మ్యా చ్‌లో ఘోరంగా విఫలమై ఆదిలోనే వాట్సన్ (1) పరుగు మాత్రమే చేసి అక్సర్ పటేల్ బౌలింగ్‌లో ఆదిలోనే చేతులేత్తేశాడు. మరో ఓపెనర్ విష్ణు వినోద్ (7) వాట్సన్ బాటలోనే వెనదిరిగాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం ఆర్‌సిబిలోకి వచ్చిన డివిలియర్స్ వాట్సన్ స్థానంలో క్రీజులోకి రావడం తోనే రెండు పోర్లు, ఒక సిక్స్‌తో మెరుపులు మెరిపిం చాడు. గత మ్యాచ్‌లో విజృంభించిన కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లో రాణించలేక కేవలం ఒక పరుగు మాత్రమే తీసి ఎల్‌బిడబ్లుగా పెవిలియన్‌కు చేరా డు.

4.6 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సిబి 22 పరు గులు చేయగా మూడు వికెట్లను చేజార్చుకుంది. జాదవ్ స్థానంలో వచ్చిన మన్‌దీప్‌సింగ్ డివిలి యర్స్‌కు జోడీగా క్రీజులో నిలకడగా ఆడుతూ స్కో రుబోర్డు వేగాన్ని నెమ్మదిగా పెంచేశారు. అయితే మన్‌దీప్ (28) పరుగులు చేసి అరోన్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా నిష్క్రమిం చాడు.స్టార్ బిన్ని (18) పరుగులతో క్రీజులో ఉన్నా డు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి బెంగళూరు జట్టు 148 పరుగులు చేసి పంజాబ్ జట్టుకు 149 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, పంజాబ్ బౌలర్లలో అరోన్ రెం డు వికెట్లు తీసుకోగా, అక్సర్ పటేల్, సందీప్ శర్మ, వరుణ్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా, ఈ సీజన్‌లో ఆర్‌సీబి రెండు మ్యాచ్‌లు ఆడగా, అందు లో ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయింది. బెంగళూ రు జట్టులోకి వస్తాడానుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి రాకపోయినప్పటికీ గాయం నుంచి కోలుకున్న డివిలియర్స్ మాత్రం అందుబాటులోకి రావడం బెంగళూరుకు కలిసొచ్చింది.

స్కోరు వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్:
షేన్ వాట్సన్ (బి) అక్సర్ పటేల్; 1, విష్ణు వినోద్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ ; 7, ఎబి డెవిలియర్స్ నాటౌట్ ; 89, కేదార్ జాదవ్ ఎల్‌బిడబ్లు (బి) ఆరోన్; 1, మన్‌దీప్ సింగ్ (సి) సాహా (బి) అరోన్ ; 28, స్టార్ బిన్ని నాటౌట్ ; 18, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లు).
వికెట్ల పతనం: 1-2, 2-18, 3-22, 4-68.
పంజాబ్ బౌలర్లు : అక్సర్ పటేల్ : 4-0-12-1, సందీప్ శర్మ : 4-0-26-1, మోహిత్ శర్మ : 4-0-47-0, అరోన్ : 4-0-21-2, టి.నటరాజన్ : 1-0-13-0, స్టోయినీస్ : 3-0-28-0.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్:
మనన్ వోహ్రా ఎల్‌డబ్లు (బి) మిల్స్ ; 34, హసీమ్ ఆమ్లా నాటౌట్ ; 58, అక్సర్ పటేల్ (బి) చాహల్ ; 9, కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాటౌట్ ; 14,
ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం: (14.3 ఓవర్లలో 2 వికెట్లు) 150 పరుగులు
వికెట్ల పతనం: 1-62, 2-78.
బెంగళూరు బౌలర్లు : స్టాన్‌లేక్ : 4-0-41-0, ఇక్బాల్ అబ్దుల్లా : 2-0-19-0, షేన్ వాట్సన్ : 2-0-28-0, తైమాల్ మిల్స్ : 2-0-22-1, చాహల్ : 3.3-0-29-1, నెగి: 1-0-7-0.

ధనాధన్ డివిలియర్స్..

RCB

ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఎబి డివిలియర్స్ గాయం నుంచి కోలుకున్న అనంతరం తొలిసారి బెంగళూరు జట్టులో అడుగుపెట్టడంతోనే సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. వచ్చిరావడంతోనే ఆకాశమే హద్దుగా ఆడుతూ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ షేన్ వాట్సన్ సహా పలువురు వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో బెంగళూరును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు. గాయంతో మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ డెవిలియర్స్‌లో సత్తా ఏ మాత్రం తగ్గలేదు. అదే తీరు, అదే దూకుడుతో క్రీజులోకి రాగానే తనదైన శైలిలో విజృంభిస్తూ పరుగుల సునామీగా మారి పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. (46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు) ఏకంగా 89 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన సిక్సర్ల పిడుగులా అద్భుతమైన ప్రదర్శనతో అజేయంగా నిలిచాడు.