Friday, March 29, 2024

కథే హీరో

- Advertisement -
- Advertisement -

Kinnerasani trailer release

 

సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ దేవ్, మహతి బిక్షు, కశిష్ ఖాన్, శీతల్ నటీనటులుగా రమణ తేజ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి, రవి చింతల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కిన్నెరసాని’. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ “ఇందులో ఐదు కథలు ఉంటాయి. ఐదు కూడా ముఖ్యమైన క్యారెక్టర్లే. ఇందులో ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, విలన్ అని చెప్పలేము. కథే హీరో. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. రమణ తేజ ఇచ్చిన అవుట్‌ఫుట్‌కు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము”అని అన్నారు. చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ “ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. ఇందులో చాలా మిస్టరీ ఉంటుంది. సాయితేజ్ స్క్రీన్ ప్లే బిగ్ హైలెట్ అవుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి చింతల, కశిష్ ఖాన్, శీతల్, దినేష్, రవీంద్ర విజయ్, మహతి బిక్షు, అన్వర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News