Saturday, April 20, 2024

మార్చి 7న కిరణ్ అబ్బవరం మీటర్ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌‘మీటర్‌’. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌చిత్రాలకు కేరాఫ్‌అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ మేకర్స్‌సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ఎంటర్‌టైన్‌మెంట్‌పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రమేష్‌కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 7న  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ  సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఆయనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా వుంటుంది అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News