Friday, July 11, 2025

రేవంత్‌కు అవగాహనా లేమి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోసమో, రేవంత్‌రెడ్డి కోసమో పని చేయదని, తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోడీని చూసి తెలుసుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి చురకలు వేశారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ డిపిఆర్‌కు ఆమోదం తెలియజేయలేదంటూ సిఎం చేసిన వ్యాఖ్యలు అర్ధర లేనివని పేర్కొన్నారు.

మెట్రో రైలు రెండో దశ డిపిఆర్‌లో పేర్కొన్న అంశాలు, వాటి సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం నిశిత పరిశీలన చేస్తోందని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నువ్వు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయాల కోసం ఎలాపడితే అలా మాట్లాడితే ఎలా అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అవగాహన లేకుండా మీరే కాదు, మీ సహచర మంత్రులు సైతం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఏకగ్రీవం కావాలి
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని కేంద్ర మంత్రి, ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నోటిఫికేషన్ విడుదలై, సోమవారం నామినేషన్ల స్వీకరణ, సాయంత్రానికి పరిశీలన పూర్తవుతుందని తెలిపారు. జూలై ఒకటో తేదీ మంగళవారం ఎన్నిక నిర్వహించి అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తారని చెప్పారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్, పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి శోభా కర్లందాజ్లే రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. ఈ ఇద్దరి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News