Home తాజా వార్తలు యాదాద్రీశుడి సేవలో కిషన్ రెడ్డి

యాదాద్రీశుడి సేవలో కిషన్ రెడ్డి

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు కిషన్‌ రెడ్డికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. కొండపైన పునర్ నిర్మాణం అవుతున్న మెయిన్ టెంపుల్ ను పరిశీలించారు.