Home తాజా వార్తలు పతంగులు ఎగరవేస్తున్నారా…

పతంగులు ఎగరవేస్తున్నారా…

kite-festival
విద్యుశాఖ ఆపరేషన్ డైరక్టర్ శ్రీనివారెడ్డి

హైదరాబాద్: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో గాలిపటాలు ఎగరవేసేవారు ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్ షాక్‌లకు గురవుతున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులకు చెబుతున్నారు. సంక్రాంతి సందర్బంగా పతంగులు ఎగరవేసేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుని పండుగను ఆనందంగా జరుపుకోవాలని విద్యుత్ శాఖ ఆపరేషన్ డైరక్టర్ జె. శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదక విద్యుత్ పరికరాలు లేని చో పతంగులు ఎగరవేయాలన్నారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, తీగలు ట్రాన్‌న్సఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరవేయవద్దని ఆయన హెచ్చరించారు.

పిల్లలు, యువకులు విద్యుత్ వైర్ల మీద పడిన గాలిపటాలను తీసేందుకు ప్రయత్నిస్తుంటారని, అలా చేసే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉందన్నారు. భవనాల మీద నుంచి గాని, సగం నిర్మించిన గోడల మీదనుంచి పతంగులు ఎగరవేసే ప్రయత్నం చేయవద్దని, దీంతో విద్యుత్ తీగలు శరీరానికి తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతే కాకుండా పతంగులు ఎగరవేసేందుకు మెటాలిక్ దారాలను వినియోగించవద్దని వీటి ద్వారా విద్యుత్ షాక్‌ల తగిలే అవకాశం ఉందంటున్నారు. ఈ సూచనలను దృష్టిలో పెట్టుకుని పండగును ప్రశాంతంగా జరుపుకోవాలని, ఒక వేళ ఏదైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 1912కు గాని లేదా సమీపంలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు.

Kite Flying Safety Tips for Children