Home తాజా వార్తలు ఉద్యమనేతే పాలకుడు కావడం తెలంగాణ ప్రజల అదృష్టం : కెకె

ఉద్యమనేతే పాలకుడు కావడం తెలంగాణ ప్రజల అదృష్టం : కెకె

KK Comments On Telangana CM KCRహైదరాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమనేత కెసిఆర్ అని టిఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు(కెకె) పేర్కొన్నారు. ఉద్యమ నేతే రాష్ట్ర పాలకుడు కావడం ప్రజల అదృష్టమని ఆయన చెప్పారు. ఉద్యమ నేత నుంచి ఎదిగి పాలన చేస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందని కెకె తెలిపారు. హైటెక్స్ లో జరుగుతున్న టిఆర్ఎస్ ప్లీనరీలో కెకె స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ప్లీనరీ యావత్ తెలంగాణ ప్రజలకు పండుగని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో కెసిఆర్ ఎన్నో కష్టనష్టాల బారినపడినప్పటికీ, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన అపరమేధావిగా నిలిశారని కెకె కొనియాడారు. కెసిఆర్ మరోమారు టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ ప్రజల మనస్సుల్లో శాశ్వత స్థానం సంపాదించుకుందని కెకె తెలిపారు. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకెళుతుందని ఆయన స్పష్టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రోజు లేదని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పాలనలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ దేశానికే తలమానికంగా మారారని కెకె పేర్కొన్నారు. మరో 20 ఏళ్లు రాష్ట్రంలో టిఆర్ఎస్ అదికారంలో ఉండడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.