Home తాజా వార్తలు ఆ ఛాన్స్ రాహుల్‌కే ఎక్కువ: ఆకాశ్ చోప్రా

ఆ ఛాన్స్ రాహుల్‌కే ఎక్కువ: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు యువ ఆటగాడు లోకేశ్ రాహుల్‌కే అధికంగా ఉన్నాయని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే రాహుల్‌కే ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. ఇక రాహుల్ కెప్టెన్సీ ఈసారి ఐపిఎల్ పరీక్షలాంటిదేనన్నాడు. ఐపిఎల్‌లో రాహుల్ పంజాబ్ జట్టు ఎలా నడిపిస్తాడనే దానిపైనే అతని కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉందన్నాడు. రానున్న రోజుల్లో రాహుల్ టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగడం ఖాయమన్నాడు. నిలకడగా రాణిస్తే అతనికి సారధ్య బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యం లేదన్నాడు. అయితే ఇదంతా తేలికేమీ కాదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ను మించిన కెప్టెన్ ఎవరూ లేరన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా రాహుల్ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నాడు. అతనికే కెప్టెన్సీ దొరుకుతుందనే అభిప్రాయాన్ని చోప్రా వ్యక్తం చేశాడు.

KL Rahul will become future Captain: Aakash Chopra