Wednesday, March 22, 2023

గ్రేటర్‌లో విలీనానికి నో

- Advertisement -

ktr

*నగర పంచాయతీలు,
మున్సిపాలిటీలకే మొగ్గు
*ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలకు కాలం చెల్లినట్లే
*జనాభా ఆధారంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీల విభజన
 కసరత్తు పూర్తి చేసిన జిల్లాల యంత్రాంగం

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం దాదాపుగా విరమించుకుంది. శివారు గ్రామలను గ్రేటర్‌లో విలీనం చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా స్థానిక ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచనలో పడింది. గ్రేటర్‌లో విలీనం చేయకుండా 15 వేల జనాభాకు ఒక నగర పంచాయతీ/ మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్ సోమవారం నాడు మేయర్ రామ్మోహన్, శివారు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి, సుధీర్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు ఆంశాలపై చర్చించారు. గ్రేటర్ విలీనం చేయడం కన్నా అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 167 గ్రామాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి కొత్త నగర పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటుపై పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించి నివేదికలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గ్రేటర్‌లో విలీనంపై ప్రజల్లో వస్తున్న భయాందోళనలు దూరం చేయాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటిలగా మార్చడం ద్వారా అభివృద్ది వేగం పెరగడంతో పాటు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని కెటిఆర్ ప్రజా ప్రతినిధులకు బరోసా కల్పించినట్లు తెలిసింది.
మేడ్చల్‌లో 35 నగర పంచాయతీలు….
మేడ్చల్ జిల్లాలో 32 నగర పంచాయతీ/ మున్సి పాలిటిలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. 15 వేల జనభా ప్రతిపాధికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొన్ని గ్రామ పంచాయతీలలో పక్కనున్న గ్రామాలను విలీనం చేసి నగర పంచాయతీలుగా మార్చుతున్నారు. కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడ, దమ్మాయిగూడ, నాగారం, చీర్యాల, రాంపల్లి, తిమ్మాయిపల్లి, గోదుమకుంటలను నగర పంచాయతీలుగా మార్చనున్నారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని పోచారం, యన్నంపేట్, చౌదరిగూడ, ఇస్మాయిల్‌ఖాన్ గూడ, కొర్రెముల, వెంకటాపూర్, కాచివాని సింగార ం, ప్రతాప సింగారం, నారపల్లిలను నగర పంచాయతీలుగా మార్చడానికి ప్రణాళికలు సిద్దం చేశారు. మేడ్చల్ మండలంలో కండ్లకోయ, గుండ్లపోచంపల్లి గ్రామాలు నగర పంచా యతీలుగా మారనున్నాయి. శామీర్‌పేట్‌లో పోతాయిపల్లి, తూంకుంట, దేవరయంజాల్, ఉప్పర్‌పల్లి కాప్రా మండలంలో జవహర్‌నగర్‌ను నగర పంచాయతీగా మార్చనున్నారు. బాచుపల్లి మండలంలో నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, దుండిగల్ మండ లంలో దూలపల్లి, కుత్బుల్లాపూర్ మండలంలో కొంప ల్లి, మల్లంపేట్, డిపి పల్లి, బౌరంపేట్ గ్రామాలను నగర పంచాయతీలుగా మార్చనున్నారు. అవుటర్ రింగ్ రోడ్డుకు బయటవైపు పక్కనే ఉన్న ఘట్‌కేసర్,గాగిల్లాపూర్, దుండిగల్‌లను సైతం నగరపంచాయతీలుగా మార్చనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో….
రంగారెడ్డి జిల్లాలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను నగ ర పంచాయతీలు/ మున్సిపాలిటిలుగా మార్చడానికి ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. గతంలో ప్రతిపాధించిన మాధిరిగా గ్రేటర్‌లో విలీనం చేయ కుండా 15 వేల జనభా ప్రతిపాధికన నగర పంచా యతీలుగా మార్చనుండటంతో మెజారీటి గ్రామ పంచాయతీలు నేరుగా నగర పంచా యతీలుగా మారనున్నాయి. గండిపేట్ మండల పరిధిలోని బండ్లగూడ, కిస్మత్‌పూర్, హైదర్‌షోకోట, నార్సింగి, మణికొండ, పుప్పల్‌గూడ, నెక్నాపూర్, కోకాపేట్, పిరాంచెరువు తదితర గ్రామాలు నగర పంచాయతీలుగా మారనున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న శంషాబాద్, కొత్వాల్‌గూడ, సాతంరాయిలు నగర పంచాయతీలుగా మారనున్నా యి. మహేశ్వరం, ఇబ్రహింపట్నం నియోజకవర్గాలలోని ఔటర్‌లోపలి గ్రామాలను నగర పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News