Home జాతీయ వార్తలు విజ్ఞానం విధ్వంసానికి తోడు కావొద్దు

విజ్ఞానం విధ్వంసానికి తోడు కావొద్దు

ind2

సాంకేతిక విప్లవాలు అభివృద్ధి సాధనాలు కావాలి
ఉగ్రవాదులు, హ్యాకర్లు, సైబర్ జాగాను దుర్వినియోగం చేస్తున్నారు : దుబాయ్ సదస్సులో ప్రధాని మోడీ

దుబాయ్: సైబర్‌స్పేస్‌ను దుర్వినియోగం చేయరాదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హెచ్చరించారు. ర్యాడికలైజేషన్‌కు సైబర్‌స్పేస్ వనరుకాకూడదన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని విధ్వం స సాధనంగా కాకుండా అభివృద్ధి సాధనంగా ఉపయోగించాలని సూచించారు. వరల్డ్ గవర్నమెంట్ ప్లీనరీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యా ఖ్యలు చేశారు. ఉగ్రవాదులు, హ్యాకర్లు సైబర్‌స్పేస్‌ను దుర్వినియోగం చేసే పనిలో ఉన్నారన్నా రు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందరికీ సౌభాగ్యం అందించాలని చెప్పారు. కృత్రిమ మేధస్సు, నానో, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కం ప్యూటింగ్‌లో భారత్ అగ్రస్థానంలో ఉందని మోడీ పేర్కొన్నారు. ఆయన ఐదు ఇలు, ఆరు ఆర్లు గురించి ప్రస్తావించినప్పుడు ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ పేదరికం, పౌష్టికాహార లోపం తొలగలేదన్నారు. ‘మరో ప్రక్క క్షిపణులు, బాంబుల తయారీకి పెద్ద ఎత్తున డబ్బు, సమయాన్ని వినియోగిస్తున్నాం. మనం సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి సాధనంగా వాడాలే తప్ప విధ్వంసానికి కాదు’ అని అన్నారు. కొంద రు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్‌స్పేస్‌ను ర్యాడికలైజ్ చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ లో క్యాడర్ రిక్రూట్‌మెంట్ కోసం జిహాదీలు సైబర్‌స్పేస్‌ను ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. 140 దేశాలు, 4000 మంది ప్రతినిధులు పాల్గొంటున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 6వ సమావేశంలో భారత్ ‘అతిథి దేశం’గా పాల్గొంటోంది. ‘వరల్డ్ గవర్నమెంట్ సదస్సుకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అన్నది నాకే కాక 125 కోట్ల భారతీయులకు గర్వకారణం’ అని మోడీ అన్నారు. దుబాయ్ ప్రభుత్వం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడాన్ని ఆయన కొనియాడారు. ఎడారి ప్రాంతాన్ని మార్చేసిందని చెప్పారు. ఇదో అద్భుతం, ప్రపంచానికి గల్ఫ్ ఎమిరేట్స్ ఉదాహరణ అన్నారు. జనాభావృద్ధి అత్యధికంగా పెరిగినప్పటికీ ప్రపంచ జనాభాలో 9.5 శాతం మంది ఇంకా దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నారు. ‘నేడు పేదరికం, నిరుద్యోగం, విద్య, ఇళ్లు, మానవ ఉపద్రవాళ్లు సవాలుగా నిలిచాయి’ అన్నారు. ‘ అభివృద్ధి ద్వారానే ఈ సమస్యలన్నింటినీ అధిగమించగలం. అందుకనే నా ప్రభుత్వం సాంకేతిక వినయోగంపై పనిచేస్తోంది’ అని వివరించారు. తమ ప్రభుత్వం మంత్రం ‘సబ్‌కే సాత్, సబ్‌కా వికాస్’ అన్నారు. 125 కోట్ల మందికి సాధికారతను కల్పించే కీలక రంగాలపై భారత్ దృష్టిసారించిందన్నారు. గత 25 ఏళ్ల కాలంలో భారత్‌లో ప్రసూ తి మరణాలు మూడు రెట్లు తగ్గిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు సగం అన్నారు. భారత ఉపగ్రహ కార్యక్రమాన్ని ఆయన కొనియాడారు. అంగారక గ్రహ కక్ష కార్యక్రమానికి కిలో మీటరుకు వ్యయం కేవలం రూ. 7 అయిందన్నారు. భారత్‌లో ట్యాక్సీ కారు ఎక్కితే కిలోమీటరుకు రూ. 10 అవుతుందని పోల్చారు. భారత్‌లో 65 శాతం జనాభా యువతేనని, వారంతా 35 ఏళ్లలోపువారేనని, సాంకేతిక విజ్ఞానం ద్వారా యువతకు సాధికారతను అందించడం ద్వారా నవభారత్‌ను సాధించాలన్నదే తమ దేశం స్వపమని చెప్పారు. టెక్నాలజీ ఆలోచన అంత వేగంగా మారుతోందన్నారు. ప్రపంచ మార్పులో కూడా సాంకేతికత పెద్ద మాధ్యమంగా మారిందన్నారు. ‘మేము ఆరు ఆర్స్ అనుసరిస్తున్నాం. అవి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్, రీడిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్’ అని వివరించారు. దీనికి ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.