Friday, March 29, 2024

లక్ష్యానికి గురిపెట్టా.. విజయం సాధించి తీరుతా

- Advertisement -
- Advertisement -

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టాభద్రుల తెజస అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం

Kodandaram

మన తెలంగాణ/హైదరాబాద్ : లక్ష్యానికి గురిపెట్టా.. విజయం సాధించి తీరుతానని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ తెజస ఎంఎల్‌సి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు. మన తెలంగాణ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రసాధన నిర్మాణంలో కీల క భూమిక వహించామన్నారు. తెలంగాణ అభివృద్ధికోసం పోరాడుతున్నామని కోదండరాం స్పష్టం చేశారు. ప్రజాస్వామిక తెలంగాణకోసం పోరు సల్పుతున్నామన్నారు. తెలంగాణలో రాజకీయాలు మారాల్సిన అవసరం ఎంతై నా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సమి ష్టి ప్రయోజనాలు, ఉద్యమ ఆకాంక్షలు సాధించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

గత ఆరేళ్లుగా భావ వ్యాప్తి కి, ప్రజా సమస్యల పరిష్కార సాధన దిశగా శ్రమించ డం జరిగిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు సాధించాల ని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నానని మరో ప్రశ్నకు సమా ధానంగా కోదండరాం వెల్లడించారు. తెలంగాణలో నిరం కుశ పాలనను తొలగించి ఒక ప్రజాస్వామ్యయుత పాల న పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. ఆరేళ్ల పోరాటానికి ఈ ఎన్నికలు కీలకంగా నిలవనున్నాయని తెలిపా రు. పాలనలో మార్పు.. చట్టబద్ధమైన పాలన తెలంగాణ లో అనివార్యమని ప్రొఫెసర్ కోదండరాం చెప్పుకొచ్చా రు. ఎంఎల్‌సి పరిధిలో ఉన్న 11 జిల్లాలు, 34 నియోజకవర్గాల్లో తాను పర్యటన జరిపానని, పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇంకా కొన్ని మండలాల్లో పర్యటించాల్సి ఉందన్నారు. వివిధ సంఘాలు సైతం తనకు మద్దతుగా నిలిచాయని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. పాల న స్వభావం మారాలి..మెరుగైన పాలన ప్రజలకు అందా లి అనేదే తన అభిలాష అని అన్నారు. దానిని సాధించే దిశగా పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో ఉన్నానని ప్రొఫెస ర్ కోదండరాం పేర్కొన్నారు.

గత ఆరేళ్లలో తెలంగాణ లో ప్రజా సమస్యలు మరుగున పడిపోయాయని ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎ కన్నా ఎంఎల్‌సి ఎన్నికలే సవాల్‌గా ఉంటాయని ఒక ప్రశ్నకు ఆయన నర్మగర్భంగా సెలవిచ్చారు. రాష్ట్రంలో మార్పు కోసం తన ఈ ప్రయత్నానికి తనకు నానాటికి లభిస్తున్న మద్దతేనని, ఆ మద్దతుతో తన గెలుపు సునాయాసం కాగలదన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రొఫెసర్ కోదండరాం కనబర్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించి ఆరేళ్లు దాటిపోయినా అనుకున్న లక్షాలను సాధించలేకపోయామని, ఆ లక్షాల సాధనే తన అజెండా అని ఆయ న పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన ఎన్నికల ప్రచారం లో సవివరంగా తెలియపరుస్తున్నానని ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తాను పాటుపడతానని ఆయన చెప్పుకొచ్చా రు. ప్రజామోద పాలన దిశగా నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రొఫెసర్ కోదండరాం నొక్కి చెప్పారు. మిగిలిన కొన్ని మండలాల్లోనూ తాను ప్రచా రం నిర్వహిస్తానని ప్రొఫెసర్ కోదండరాం చెప్పుకొచ్చా రు. లక్ష సాధనకు చేరువ అవుతానని ప్రొఫెసర్ కొదండరాం చెప్పారు.

తాను గెలిస్తే ఉద్యోగులు, పట్టభద్రుల, నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తానని ప్రొఫెసర్ కోదండరాం చెప్పుకొచ్చారు. రాష్ట్రం సాధించుకున్నా ఫలితాలు సాధించలేకపోయామన్న ఆయ న ఆ ఫలితాల సాధనే తన ఏకైక అజెండాగా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టి స్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేడు విద్య, వైద్య అందని ద్రాక్ష పండు చందాన తయారైందని, ఆ సమస్యను నివారించడమే కాకుండా ఉచిత విద్య, వైద్య సాధన దిశగా మండలిలో ఎలుగెత్తి చాటుతానని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News