Wednesday, April 24, 2024

కేంద్రం ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి: కోదండరాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నిధుల సమీకరణకు ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాని తెలంగాణ జనసమిటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును కోసినట్టేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై కోదండరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిధుల సమీకరణకు ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును కోసినట్టేనని పేర్కొన్నారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆర్థిక ప్రగతి ఐదు శాతమే ఉందన్నారు. జిఎస్టి, నోట్ల రద్దుపై మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించాలన్నారు.

Kodandaram has objected to Union Budget 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News