Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కోడెల అంత్యక్రియలు పూర్తి…

కోడెల అంత్యక్రియలు పూర్తి…

Kodela

 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. కోడెల అంత్యక్రియల్లో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నరసారావుపేటలోని స్వర్గపురిలో కోడెల భౌతికకాయానికి ఆయన కుమారుడు అంతిమ సంస్కారాలను నిర్వహించాడు. కాగా, కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోడెల సోమవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Kodela funeral Complete with govt entities