Home తాజా వార్తలు కోడెల మృతిపై మూడు టీమ్‌లతో దర్యాప్తు

కోడెల మృతిపై మూడు టీమ్‌లతో దర్యాప్తు

CP Anjani Kumar

 

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం వేధింపుల కారణంగానే కోడెల ఆత్మాహత్య చేసుకున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క తన కొడుకుతో ఉన్న గొడవల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైసిపి నేతలు చెబుతున్నారు.

బసవతారకం హాస్పిటల్ కు కోడెలను ఎందుకు తరలించారని, కోడెల ఆత్మహత్య పలు అనుమానాలకు దారిస్తుందని, తెలంగాణా ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎపి మంత్రి బొత్స డిమాండ్ చేశారు. ఈ విధంగా కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో  బంజారాహిల్స్ ఎసిపి నేపథ్యంలో మూడు టీమ్ లు కోడెల మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. క్లూస్ టీం, టెక్నికల్ టీమ్ కోడెల మృతి చెందిన ఇంటిని తనిఖీ చేస్తుందని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత కోడెల మృతికి గల కారణాలు వెల్లడవుతాయని  సిపి అంజనీకుమార్ వెల్లడించారు.

Kodela Suicide Case Filed as Suspicious in Hyderabad