Home తాజా వార్తలు స్మిత్‌కు పాయింట్ దూరంలో కోహ్లీ

స్మిత్‌కు పాయింట్ దూరంలో కోహ్లీ

Viratమళ్లీ అగ్రస్థానానికి చేరే అవకాశం, టాప్ 20లో మయాంక్ అగర్వాల్‌కు స్థానం

దుబాయి : ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ 936 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలోఉన్నాడు. తొలి టెస్టు తర్వాత కోహ్లీ 899 పాయింట్లతో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ కన్నా కోహ్లీ ఒక్క పాయింట్ దూరంలోమాత్రమే నిలిచాడు. రాంచీ వేదికగా ఈ నెల 19న ప్రారంభం కానున్న మూడో టెస్టు తర్వాత కోహ్లీ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంటాడని అందరూ భావిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్ 20లో స్థానం సంపాదించాడు.

తొలి టెస్టులో డబుల్ సెంచరీతో పాటుగా రెండో టెస్టులో సెంచరీ చేసిన మయాంక్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో పుజారా నాలు గో స్థానంలో ఉండగా రహానే తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ రెండో స్థానంలో, ఫిలాండర్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అజయ్ జడేజా రెండో స్థానంలో నిలిచాడు.

Kohli 2 points away from overtaking Steve Smith