Thursday, April 25, 2024

ఆత్మవిశ్వాసం పెంచే విజయమిది..

- Advertisement -
- Advertisement -

Kohli praised Rahul for playing historic innings

విరాట్ కోహ్లి

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో చారిత్రక విజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లి తనదైన శైలీలో స్పందించాడు. ఈ గెలుపు తమకు ఎంతో ప్రత్యేకమైందన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగిన తాము అద్భుత విజయాన్ని సాధించడం ఎంతో ఆనందం కలిగించిందన్నాడు. ఈ గెలుపు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. సమష్టి కృషి వల్లే జట్టుకు విజయం సాధ్యమైందన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్, షమి చేసిన ప్రదర్శన చిరకాల గుర్తుండి పోతుందన్నాడు. కఠినమైన పిచ్‌పై రాహుల్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడని కోహ్లి ప్రశంసించాడు. ఇక క్లిష్టమైన పరిస్థితుల్లో షమి అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయాడన్నాడు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకున్నా షమి అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ పతనాన్ని శాసించాడని ప్రశంసించాడు. ఇక బుమ్రా, సిరాజ్, శార్దూల్, అశ్విన్‌లు కూడా తమవంతు పాత్ర సక్రమంగా పోషించారన్నాడు. అందరి పోరాటం వల్లే టీమిండియాకు విజయం వరించిందని కోహ్లి పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News