Home నాగర్ కర్నూల్ అవినీతి రాబందుల నుంచి కొల్లాపూర్‌ను విముక్తి చేద్దాం

అవినీతి రాబందుల నుంచి కొల్లాపూర్‌ను విముక్తి చేద్దాం

San-mafia

* ఇసుక అక్రమ కేసులో
మంత్రి జూపల్లి హస్తం ఉంది.
* ప్రాజెక్టులు, ఇసుక, కంకర పేరుతో
దోపిడీ చేస్తున్నారు:కాంగ్రెస్ నియోజకవర్గ
ఇన్‌ఛార్జ్ భీరం హర్షవర్థన్‌రెడ్డి వెల్లడి

మన తెలంగాణ/కొల్లాపూర్: ఇసుక మాఫీయతో పాటు తెలంగాణ ఖని జ సంపందను ఆంద్ర ప్రాంతానికి తరలిస్తున్నారని కాంగ్రెస్ నియోజక వర్గం ఇన్‌ఛార్జీ భీరం హర్షవర్థన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణం లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏ పథకం అమలు కావాలన్నా మంత్రి కనుసైగలో నడుస్తున్నాయని ఇంత పెద్ద ఇసుక అక్రమ రవాణా మంత్రికి తెలియకుండా ఎలా జరుగుతుం దని ఆయన ప్రశ్నించారు.ఈఇసుక అక్రమ రవాణా వెనుక మంత్రితో పాటు, ఆయన బందువులు,స్థానిక జడ్‌పిటిసి హస్తం ఉందని ఆయన ఆరోపించారు.ఇంత పెద్ద కుంబకోణం జరుగుతే రెవిన్యూ, ఆటవీశాఖ, మైనింగ్, పోలీస్ అధికారులు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. 20 సంవత్సరాలు నీకు అధికారం అందించిన ప్రజలకు నీచర్మం తీసి వారి కి చెప్ఫులు కుట్టించిన వారి రుణం తీర్చుకోలేవని మంత్రి ఉద్దేశించి అన్నారు.

కొల్లాపూర్‌ను అవినీతిలో అభివృద్ది, దోపిడిలో అభివృద్ది చేశా వని విమర్శించారు.వనపర్తి జిల్లా కలెక్టర్ అనుమతితో 5వందలు రూపా యలు కడుతే ట్రాక్టర్ ఇసుకకు అనుమతి ఇస్తున్నారని,అక్రమంగా వెళ్ళుతే 20వేలు జరిమానా విధిస్తున్నారని, ఇక్కడికి ఇంత పెద్ద మొత్తం లో ఇసుక తరలిస్తుంటే ఇసుక రాబందువులమీద చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.పోలీసులు కేవలం రామాపురం గోపాల్ అనే ఒక వ్యక్తిపై కేసు పెట్టి తప్పించుకుంటున్నారని దీని వెనుక మంత్రి వత్తిడి ఉందని ,అందుకే విచారణ చేయడంలేదన్నారు.గోపాల్ అనే వ్యక్తిని పార్టీనుండి సస్పెడ్ చేసినప్పుడు అందులో సంబందం ఉన్న జడ్‌పిటిసి హన్మంత్‌నాయక్, నరసింహ్మరావును ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

మిషన్ కాకతీయలో నీ పిఎ చేసిన అక్రమలపై ఎంక్వైరీ చేయిం చాలని డిమాండ్ చేశారు.కొల్లాపూర్ ప్రజల పంతం జూ పల్లి రాబం దువుల అంతం అని ఆయన అన్నారు. మేధావులు ఈఅవినీ తిపై నోరు విప్పాలని ఆయన కోరారు.అవినీతి రహిత కొల్లాపూర్ నిర్మా ణం కోసం అందరు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.త్వరలో తమ ఎమ్యే ల్యేతో కలిసి పారెస్టు ఉన్నత అధికారులకు ఈవిషయంపై పి ర్యాదు చే యనున్నట్లు ఆయన వెల్లడించారు.చేసిన తప్పును కప్పిపు చ్చుకోవడాని కి దొంగే దొంగ అన్నట్లు టిఆర్‌ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రా వాలని బజారుకు ఎక్కుతున్నారని ఆయన విమర్శించారు. ఈసమావే శంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటం జంబులయ్య,యువ నాయకు లు రత్నప్రభాకర్‌రెడ్డి, ఒబిసి జిల్లా అధ్యక్షులు గాలియాదవ్, మాజీ ఎంపిపి పెద్ద లక్షయ్య, మండల అధ్యక్షులు రామచందర్ యాద వ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, ఎల్లూరు గ్రామ సర్పంచ్ నిమ్మల నరసిం హ్మ, మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటస్వామి,సురేం దర్‌సిం గ్, మతిన్, కుబేరయ్య, గండి భాస్కర్,తదితరులు ఉన్నారు.