Home తాజా వార్తలు హిందీలో రీమేక్ కానున్న ‘ఆడై’

హిందీలో రీమేక్ కానున్న ‘ఆడై’

kangana and amala paulముంబయి : ప్రముఖ కోలీవుడ్ నటి అమ‌లాపాల్ న‌టించిన తాజా సినిమా ‘ఆడై’. ఈ సినిమా తెలుగులో ‘ఆమె’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో అమలాపాల్  కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించింది.  జూలై 19న విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత  విక్రమ్ భట్ పొందారు. బాలీవుడ్ లో ఈ సినిమాను తీయనున్నారు. హిందీ రీమేక్ కు కూడా ఒరిజినల్ వర్సన్ ‘ఆడై’ను తెరకెక్కించిన రత్నకుమార్ దర్శకత్వంలోనే రానుంది. ఈ సినిమాలో అమలాపాల్ పోషించిన పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషించనున్నారట. ఇటీవల కంగనా రనౌత్ నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ సిఎం జయలలిత జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘తలైవి’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా జయలలిత పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత కంగనా ‘ఆడై’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేందుకు రంగం చేసుకుంటున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Kollywood Film Aadai Remake In Bollywood