Home తాజా వార్తలు అభిమానులకు ఆర్థిక సాయం చేసిన హీరో సూర్య

అభిమానులకు ఆర్థిక సాయం చేసిన హీరో సూర్య

Kollywood Hero Surya Helped Fans Financiallyచెన్నయ్ : ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య తన అభిమానులైన 250 మందికి ఆర్థిక సాయం చేశారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న తన అభిమానులకు సాయం చేయడం సంతోషాన్ని ఇచ్చిందని సూర్య పేర్కొన్నారు.  ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఆయన 250 మంది అభిమానులకు రూ.12.5 లక్షలను  అందించారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.  సూర్య  ఫౌండేషన్ అగరం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ సూర్య అందిస్తున్నారు. ప్రస్తుతం సూర్య  పాండిరాజ్, టిజే జ్ఞానవేల్, వెట్రిమారన్‌ ల దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.