Home తాజా వార్తలు ఎన్ టిఆర్ సినిమాలో విజయ్ సేతుపతి

ఎన్ టిఆర్ సినిమాలో విజయ్ సేతుపతి

Kollywood Hero Vijay Sethupathi Act In NTR Movieహైదరాబాద్ : ఎన్ టిఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాలో  ప్రముఖ కోలీవుడ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ’ఉప్పెన‘ సినిమాలో విజయ్ సేతుపతి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో విజయ్ సేతుపతికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఎన్ టిఆర్ హీరోగా తాను రూపొందిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తే బాగుంటుందన్న ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం. అద్భుత నటులైన ఎన్ టిఆర్, విజయ్ సేతుపతి ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ మజానే వేరుగా ఉంటుందని వారి అభిమానులు చెబుతున్నారు.  అయితే త్రివిక్రమ్ సినిమాలో నటించే విషయంపై విజయ్ సేతుపతి ఇంకా స్పష్టత ఇవ్వలేదు.