Home ఎడిటోరియల్ భూపోరాటాలకు స్ఫూర్తి కొమరం భీం

భూపోరాటాలకు స్ఫూర్తి కొమరం భీం

komaram-bheem22ఆదివాసుల ఆశాజ్యోతి, భూ పోరాట యోధుడు కొమరం భీం. నాటి జనగామా, నేటి ఆసిఫాబాద్ తాలుకా, రౌటసంకేపెల్లి గ్రామంలో 1900 సం.రం.లో జన్మించారు. యుక్త వయసులో కొమరం భీం చిన్న తండ్రి గారి వద్దకు కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళినారు. పినతండ్రి పంట ఆక్రమణకు వచ్చిన భూస్వామి సిద్ధిక్‌ను, అతని గుండాలను భీం ఎదిరించారు. ఘర్షణలో బండ దెబ్బలకు గురి అయిన సిద్ధిక్ మరణించాడు. సిద్ధిక్ గుండాలు పారిపోయారు. మరుసటి రోజు నైజం పోలీసులు భారి సంఖ్యలో భీం దట్టమైన అడవిలోకి వెళ్లి చాకచక్యంగా తప్పిం చుకున్నాడు. సుర్దాపూర్‌లో గిరిజనులను పోలీస్ కష్టడికి తరలించినారు.

అడవిలో వారం రోజులు అజ్ఞాత జీవితం గడిపిన కొమరం భీం ఊరి చివరకు చేరి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినారు. నువ్వు ఇక్కడ దొరికితే నిన్ను పోలీసులు చంపేస్తారు. నువ్వు ఎక్కడి కైనా దూరం వెళ్లి బ్రతుకు అంటూ భీం కి చెప్పి పంపిం చారు. కొమరం భీం తన ఇద్దరు సహచరు లతో మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు వలస వెళ్ళి నారు. అక్కడొక ఒక ప్రైవేటు ప్రింటింగ్‌ప్రెస్‌లో పని చేయసాగారు. ఆ విషయం ఏదోవిధంగా తెలుసు కున్న నైజాం పోలీసులు చంద్రపూర్ ప్రింటింగ్ ప్రెస్‌కు చేరుకున్నారు. వారిని గమనించిన కొమరం భీం తప్పించుకుని పరారయ్యారు. కొమరం భీం చంద్రపూర్ స్టేషన్ లో రైలు ఎక్కి గమ్యం తెలియని ప్రయాణం చేసి అస్సాం చేరు కున్నాడు. తన వెంట ఒక్క సహచరుడు మాత్రమే ఉన్నాడు. మరొకడు చంద్రపూర్ లోనే ఉండి పోయా డు. అస్సాం తేయాకు తోటలో కుమురం భీం అతని సహచరుడు కూలి పని చేస్తూ జీవితం సాగించారు. అస్సాం ప్రాంతంలో సమీప బెంగాల్ రాష్ట్రంలో భూమి కోసం భుక్తి కోసం కమ్యునిస్ట్ పార్టీ సాగి స్తున్న తేబాగ్ పోరాటాలను గ్రహించాడు. అక్కడి జల్, జంగల్, జమీన్ నినాదాలు, పోరాటాలను ఆకలింపు చేసుకున్నారు.

పోరాడితేనే భూములు ప్రజలకు వస్తాయని, భాషలు వేరైనా అందరికీ భూమి ముఖ్యమైనదని, ఆలోచనలోపడి అక్కడి పోరాటాలతో ప్రభావితం అయ్యాడు. కొమరం భీం ప్రాథమిక విద్యనూ నేర్చు కున్నాడు. సుమారు 5సం.రాలు. అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో బ్రతుకు పోరాటం సాగించారు. పని చేస్తూ జీవించారు. తిరిగి తన స్వగ్రామంకు బయలు దేరినారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి మన్యంలో అల్లూరి సీతారామరాజు పోరా టాలను, స్వాతంత్య్ర యోధుడు భగత్ సింగ్, బెంగాల్‌లో తేభాగ్ పోరా టాన్ని భీం తెలుసు కున్నారు. ఎవ్వరికీ కనబడ కుండా సుర్దాపూర్ చేరు కున్నా డు. చాల కాలం తరవాత వచ్చి న భీంను చూసిన గిరిజన ప్రజల సంతోషానికి అంతే లేదు. కొమరం భీం కు జేజేలు పలికారు. కొమరం భీం గిరిజ నులకు భూమి సాధన కోసం గోండులు, కోలంలు, పర్దాను లను, ఆదివాసులందరినీ సమీక రించి తిరిగి అడవి బంజరుల పోడు భూములను గిరిజనులకు స్వాధీన పరిచే భూ పోరాటాన్ని కొనసాగించాడు.

కొమరం భీం నాయకత్వంలో గిరిజనులు, స్త్రీలు, పురుషులు, అడవి ప్రాంతంలో ఐక్యంగా ఈ భూమి మనది ఈ అడవి మనది, ఈ నీరు, సెలయేరు మనదే. మన భూముల పైన ఎవ్వరికీ ఆధికారం లేదు. మనం ఐక్యం గా ఉందామని శపథం చేస్తూ భూములను చదును చేస్తూ పంటలు, గిరిజనులు పండిం చారు. ఇండ్లకు పంటలు చేర్చు కున్నారు. ఆనందపడుచు కాలం సాగించారు. భూములు మాకు దక్కుచున్నాయని ఆనంద పడుచున్న కాలం అది. అంతలోనే నైజం ప్రభుత్వం గిరిజనులు భూములు స్వాధీనం చేసుకున్న విషయాలు తీసుకున్నది. పథకం ప్రకారం 1940 సం.రం. అక్టోబర్ 11న చంద్రాకారం నెలవంక ఉండే రోజులలో నైజాం పోలీసులు భారీసంఖ్యలో తుపాకులు మారణాయుధాలతో చేరుకున్నారు. నిరాయుధుడు అయిన కొమరం భీం పైన నైజం పోలీ సులు ఆధునిక ఆయుధాలతో కాల్పులు జరిపి చంపేసినారు. అనేక మంది క్షతగాత్రులు అయి నారు. కొమరం భీం అనుంగ సహచరులు కుమురం సురూ గాయాలకు గురి అయి అడవులకు తప్పించుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా అడవులలో కొమరం భీం మరణంతో విషాద ఛాయలు ఏర్పడినాయి.

భూపోరాట యోధుడు కొమరం భీం ను చంపివేసిన ఘటనపైన తెలంగాణా రైతాంగ పోరాట అగ్ర నాయకుడు రావి నారాయణ రెడ్డి స్పందించారు. కొమరం భీం మరణానికి కారకులు ఎవరు, కారణం ఏమిటి అనే విషయాల పైన విచారణ జరిపించారు. అనేక మంది గిరిజన ప్రజలు మడావి కొద్దు అనే ఒక ద్రోహి బభేజరి జోడెంఘాట్‌లో ఉన్న కొమరం భీం ఆచూకీని తెలపడం వలెనే పోలీసులు సాముహిక దాడి జరిపి కొమరం భీం ని చంపినారని గిరిజనులు తెలిపినారు. రహస్య జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ దళం మడావి కొద్దు ని చంపివేసి శాశ్వత గుణపాఠం చెప్పింది. ప్రజా ఉద్యమకారులను చంపివేస్తే ప్రతిఘటిస్తామని నైజాం ప్రభుత్వాన్ని సిపిఐ హెచ్చరిక చేసింది. అమాయకులైన ఆదివాసులకు అండగా నిలబడింది. కొమరం భీం మరణంతో ఆగిపోయిన భూ పోరాటా లను ఆదిలాబాద్ జిల్లా వ్యాపితంగా ఉవ్వెత్తున సాగించింది. వేలాది ఎకరాల భూములను పేదలకు పంచింది. నాటినుంచి కమ్యూనిస్టు పార్టీ, ఆదివాసీ సంఘాలతో కలిసి చేసిన పోరాటాల వల్లనే గిరిజనుల కొరకు ట్రైబల్ రేగ్యులషన్ చట్టం, భూమి పైన గిరిజనులను హక్కు చట్టం, పెస చట్టం, 1/70 చట్టంకోసం అడవి హక్కుల చట్టం సాధిం చటం జరిగింది. ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు (అక్టోబర్ 27) ఆదివాసీ సంఘాలు భీం వర్థంతి నిర్వహిస్తున్నాయి. గిరిజనులు ఐక్యంగా కొమరం భీం భూపోరాట స్పూర్తితో పోరాడవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.

సిపిఐ డిమాండు :
– దీర్ఘకాలంగా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న పోడు భూములను, కందకాలు తవ్వించుచున్న భూము లను తిరిగి ప్రజలకు ఇవ్వాలి.
– పోడు భూములను ప్రజలకు పట్టాలు ఇచ్చి ఫల వృక్షాలు పెంచుకొనుటకు ఇవ్వాలి. హరితహారం దీనితో సాగించాలి.
– గిరిజన పేద పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికా రులు దౌర్జన్యాలు, దాడులు నిలుపుదల చేయాలి. అక్రమ కేసులు ఎత్తివేయాలి.
– 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి.
– 2005 నాటికి పోసిషన్ లో ఉన్న గిరిజనులు, పేదలందరికీ పట్టాలు ఇచ్చి భూమి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. రక్షణ కల్పించాలి.
– రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. వ్యవ సాయానికి బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వాలి.
– ఇందిరమ్మ ఇళ్ళకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లిం చాలి.
– డ్వాక్రా గ్రూపుల రుణాలు రద్దు చేయాలి.
– దళితులతోపాటు భూమిలేని గిరిజన నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి.
– ఉట్నూరులో లేదా ఆసిఫాబాద్ లో కొమరం భీం పేరుతో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి.
– తూర్పు జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రభుత్వానికి ఆర్థిక భారంపడని కూడలి స్థలంలో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలి.

రచయిత: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే
9701827608