Home నల్లగొండ ‘కోమటిరెడ్డి’ సభ సక్సెస్

‘కోమటిరెడ్డి’ సభ సక్సెస్

reddy

*రాహుల్ గాంధీ అభినందన సభలో పాల్గొన్న
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మనతెలంగాణ/చండూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ము,ధైర్యం ఉంటే నల్లగొండ,మునుగోడు,నకిరేకల్ నియోజకవర్గాల నుంచి గెలిచే దమ్ముందా అని రాజగోపాల్‌రెడ్డి ఘాటుగా సవాల్ విసిరారు. ఆదివారం చండూరు ఉన్నత పాఠశాలలో రాహుల్ గాంధీ అభినందన సభ సజావుద్ద్దీన్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘనత విద్యార్థులు,గాయకులదేనన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడంలో విఫలం చెందారని విమ ర్శిం చారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం నాలు గు ఉద్యోగాలు సంపాదించుకున్న ఘనత కేసీ ఆర్‌కే దక్కిందని ఘాటుగా విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానన్నా హామీ ఏ ప్రాంతంలో కూడా అమలు చేయలేదని ప్రగతి భవన్‌లో మాత్రం నాలుగు ఎకరాలలో 100కోట్ల రూపాయలతో ప్రజలకు కల్వకుంట పరిపాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏ ప్రాం తం నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నా తన మనస్సు మాత్రం మునుగోడు వై పే లాగుతోందన్నారు. మునుగోడు పెద్ద కొడుకుగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌కు చెంచాగిరి తప్ప అభివృద్ధిలో శూన్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి పదవీని కూడ లెక్కచేయకుండా రాజీనామా,ఆమరణ నిరాహారదీక్ష తాను పార్లమెంటులో సోనియాగాంధీపై వత్తిడి తెచ్చానని వత్తిడి సమయంలో అధినేత్రి సోనియాగాంధీ కొన్ని పర్యాయాలు హెచ్చరించిన తెలంగాణ రాష్ట్రం కోసం వేల మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఒప్పించి డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు జన్మదిన కానుకగా అప్పజెప్పిన సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిందేనన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియాగాంధీ త్యాగం చేస్తే కేసీఆర్ ద్రోహం చేశాడని ఘాటుగా విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదిరించాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కే సాధ్యమన్నారు.అనంతరం ఏపూరి సోమన్న ఆలపించిన గేయాలను ప్రజలను ఆకట్టుకున్నాయి.అనంతరం అభినందన సభలో ఉడుతలపల్లి ఎంపీటీసీ సభ్యురాలు గంట అనురాధ సత్యం , కొంత మంది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీపీలు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి,అనంతరాజుగౌడ్,వాంకుడోతు బుజ్జి,జడ్పీటీసీ సభ్యుడు జాజుల అంజయ్యగౌడ్,శ్రీనివాస్,యాదయ్య,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధనలక్ష్మి,మునగోడు నియోజకవర్గ నాయకులు కర్నాటి వెంకటేశం,గడ్డం మురళిధర్‌రెడ్డి,కోడిగిరిబాబు,జడల చిన్న మల్లేష్,నారబోయిన రవి,గుమ్మల మోహన్‌రెడ్డి,కలిమికొండ జనార్ధన్,పాక నగేష్,సంపత్,శైలజ,దోటి వెంకటేశ్‌యాదవ్,ధర్మేందర్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.