Home తాజా వార్తలు కెసిఆర్ పై యుద్ధం వారికి సాధ్యం కాదు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కెసిఆర్ పై యుద్ధం వారికి సాధ్యం కాదు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopalనల్లగొండ : తెలంగాణ సిఎం, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై యుద్ధం చేయడం కాంగ్రెస్ నేతలు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సాధ్యం కాదని మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోను, ఆ తరువాత  తాను కాంగ్రెస్ అధిష్ఠానికి చెప్పానని ఆయన పేర్కొన్నారు. అయితే పార్టీకి నష్టం జరగరాదన్న ఆలోచనతోనే తాను మౌనంగా ఉండిపోయానని ఆయన తెలిపారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తనకు రాజకీయ జన్మనిచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసులు జారీ చేసిందని, ఆ నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని ఆయన తెలిపారు. ఇప్పటివరకు తనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

Komatireddy Rajagopal Comments on CM KCR