Thursday, April 25, 2024

పార్మాసిటిని రద్దు చేయాలి: ఎంపి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : విషం వెదజల్లె పార్మాసిటి వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వెంటనే రద్దు చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజురాబాద్ ఎంఎల్ఎ ఈటల రాజెందర్, కిషాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకులు పి.జంగారెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం పార్మాసిటి వ్యతిరేఖ పోరాట కమిటి ఆద్వర్యంలో చేపట్టిన రెండవ రోజు పాదయాత్ర ఇబ్రహీంపట్నం కు చేరింది . ఈసందర్బంగా రైతుల మద్దతుగా అఖిల పక్ష పార్టీలు మద్దతు పలికారు.. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలు పెట్టకుండా , ప్రజల , రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా బెదిరించి రైతుల దగ్గర బలవంతపు భూసేకరణ చేశారని అన్నారు.

7 ఏండ్ల నుండి ఇంకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4 గ్రామాలలో రైతులు ప్రజలు, అనేక మార్లు సంబందిత అధికారులకు విన్నవించిన పలితం లేదని ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వం చెప్పిన ఇవ్వలేదని అన్నారు. అసైన్డ్ భూములకు రూ.8 లక్షలు పట్టా భూములకు 16 లక్షలు యిచ్చి ప్రభుత్వం మాత్రం కోటి రూపాయలకు అమ్ముకొని రైతులకు నిలువునా మోసం చేశారని అన్నారు. పార్మాసిటి ఏర్పడితే భూములు కోల్పోయిన కుటుంబాలకు పార్మాసిటి కంపనీలలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్మాసిటి వద్దని ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీలు ఎల్లప్పుడు అండగా ఉంటామని చెప్పారు.

ఈ కార్యాక్రమంలో టిపిసిసి ప్రతినిథులు దండెం రాంరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత ఈసి శేఖర్‌గౌడ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్కా నర్సింహ్మారెడ్డి, కొత్త అశోక్‌గౌడ్ , గగనమోని సత్యనారాయణ , టిపిసిసి సబ్యులు మాజీ ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి , పాండాల శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి టేకుల కమాలాకర్‌రెడ్డి, యాచారంలోని అన్ని పార్టీల నేతలు పాల్గోన్నారు. పాదయాత్రతో పాటు రైతులు పెద్ద ఎత్తున యంజాల్ ఆర్డీ కార్యాలయానికి ట్రాక్టర్లపై పెద్ద ఎత్తున తరళివెళ్ళారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News