Home తాజా వార్తలు రేవంత్ సలహాలు మాకు అక్కర్లేదు: కోమటిరెడ్డి

రేవంత్ సలహాలు మాకు అక్కర్లేదు: కోమటిరెడ్డి

 

మన తెలంగాణ/హైదరాబాద్: హుజూర్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరిని పెట్టాలో మాకు తెలుసుని అని కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై పక్క జిల్లా నాయకుల సూచనలు, సలహాలు అవసరం లేదన్నారు. ఈ మధ్యలోనే కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి…ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేసారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. హుజుర్‌నగర్ నియోజకవర్గానికి రేవంత్‌రెడ్డి చెప్పిన అభ్యర్ధి పేరు తనతో పాటు మా జిల్లాకు చెందిన అగ్రనాయకులకే తెలియదన్నారు.

ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమ పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా వెంకట్‌రెడ్డి చెప్పారు. ఆమెనే సరైన అభ్యర్ధిగా ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు కొనసాగుతున్నామని, తమను కాదని కొత్త అభ్యర్ధిని పెడతారా? అని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే ఉపఎన్నికలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానం మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలు చేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే తాను పిసిసి అధ్యక్ష రేసులో లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న నేపథ్యంలో నేతలంతా కలిసిమెలిసి పార్టీకి పునర్‌వైభవానికి కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకు తాను ఎప్పుడ సిద్దమేనని అన్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డి
హుజూర్‌నగర్ స్థానం నుంచి పద్మావతినే రంగంలోకి దింపి గెలిపిస్తామని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన సోదరుడు, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్ధి ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్టానమన్నారు.

Komatireddy Venkat Reddy counter to Revanth Reddy