Home జయశంకర్ భూపాలపల్లి బిజెపిలోకి కొండా దంపతులు…!

బిజెపిలోకి కొండా దంపతులు…!

Konda Coupleహైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్  నేతలైన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉన్న వీరు 2014 ఎన్నికల సమయంలో  అధికార టిఆర్ఎస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో రాజకీయ భవిష్యత్ కోసం బిజెపిలో చేరాలని వీరు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  తమ కూతురుకి భూపాలపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే షరతును కొండా దంపతులు బిజెపి అధిష్ఠానం ముందు పెట్టినట్టు తెలుస్తోంది.  గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ ఓడిపోయారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కొండా దంపతులతో పాటు గండ్ర కూడా భూపాలపల్లి టికెట్ కోరుతుండడంతో వీరి చేరికపై తమ పార్టీలో కొంత అయోమయం చోటు చేసుకుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

Konda Couple Joins BJP