Home రాష్ట్ర వార్తలు కొండా లక్ష్మణ్‌ను కొనియాడిన వక్తలు

కొండా లక్ష్మణ్‌ను కొనియాడిన వక్తలు

Konda-Lakshman-Bapujiమన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజి శతజయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ లకతీతంగా నేతలు హాజరై బాపూజీని స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వ ర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 1915 సెప్టెంబర్ 27న లక్ష్మణ్ బాపూజి జన్మించారని ఆయన బతికి ఉన్నంత వరకూ నిరంతరం తెలంగాణ గురించే తపించారని, చివరికి తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని సైతం తృణ ప్రాయంగా వదులుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కే. స్వామిగౌడ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి. హన్మంతరావు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, బిజెపి ఎమ్మెల్యే డా. లక్ష్మణ్, తెలంగాణ సాంస్తృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యతో పాటు పలువురు చేనేత, బిసి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ కోసం నిర్విరామంగా ఉద్యమించిన తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజి స్మారకార్థం త్వరలోనే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. ఆయన కార్యాలయం జలదృశ్యాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ మెమోరియల్ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. బాపూజీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మండలి ఛైర్మన్ కె. స్వామిగౌడ్ బాపూజి సేవలను గుర్తు చేసు కున్నారు. తెలంగాణ కోసం అహరహం తపించిన బాపూజి నిజమైన దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడన్నారు. రాజ్యసభ సభ్యులు కే. కేశవ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరమే బిసి కమిషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ఎంపి వి. హనుమంత రావు మాట్లాడుతూ బాపూజీ జీవితం వచ్చే తరాలకు తెలిసేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో అగ్రవర్ణాల వారు కూడా రిజర్వేషన్ కోసం పోరాటాలు చేస్తున్నారని, హర్థిక్ పటేల్ అనే 25 ఏళ్ల వ్యక్తి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.

మరో ఎంపి రాపోలు ఆనంద భాస్కర్ మాట్లా డుతూ నాటి నుండి నేటి వరకు సాగిన తెలంగాణ ఉద్యమంలో ప్రతి సందర్భంలో బాపూజి అడుగులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల పట్ల చూపిస్తున్న సానుభూతిని చేనేత కారులు ఆత్మహత్యల పట్ల కూడా ప్రభుత్వం చూపించాలని ఆయన విజప్తి చేశారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగానే అదృష్టమన్నారు. తెలంగాణ కోసం నిరంతరం తపించే ఆయన సేవలను మరువలేనివన్నారు. తెలంగాణ పోరాటంలో బాపూజితో కలిసి పని చేయడం తమ పూర్వజన్మ సుకృ తంగా భావిస్తున్నామన్నారు. బిజేపి నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తేనే చిన్న కులాలకు గౌరవం లభిస్తుందని నమ్మిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజి అన్నారు. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ బాపూజి కేవలం బిసిల వ్యక్తే కాదని, యావత్ తెలంగాణ అణగారిన వర్గాల శక్తి అని పేర్కొన్నారు. జలదృశ్యంలోనే పుట్టిన తమ పార్టీ ఈ రోజు విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సక కమిటి వైస్ చైర్మన్లు వకు ళాభరణం కృష్ణమోహన్ రావు, కొండా వెంకట రమణ, తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షే మ సంఘం అధ్యక్షులు జాజుల  శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.