Home తాజా వార్తలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, సేవలు మరువలేనివి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, సేవలు మరువలేనివి

Konda Laxman Bapuji

 

నిర్మల్ : ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ తొలి మలి ఉద్యమ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఆదర్శాలను ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వళన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ రాష్ట్ర తొలి, మలి ఉద్యమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ స్మృత్యర్థం ఉత్సవము జరుపుకోవడం ఆనందకమన్నారు. కొండా లక్ష్మణ్ త్యాగలు ఆశయాలు, సామాజిక సేవలు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అంతకు ముందు కలెక్టర్ చౌరస్తా దగ్గర గల ఆచార్య కొండాల లక్ష్మణ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఎన్నో సత్యగ్రహాలు, దీక్షలు చేశారన్నారు.

గాంధేయ మార్గంలో స్వాతంత్య్ర కోసం పోరాడారన్నారు. వారి ఆశయాలు, సేవాభావంను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోరిపెల్లి విజయలక్ష్మిరెడ్డి, ఎఎంసి చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, జెసి భాస్కర్‌రావు, రెవెన్యూ అధికారి సోమేశ్వర్, ఆర్‌డిఓ ప్రసునాంబ, జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమాధికారి విజయ్‌కుమార్, జిల్లా పశుసంవర్థక శాఖ డాక్టర్ రమేష్‌కుమార్, సాయిబాబా, చిలుక రమణ, రాజేశ్వరి, రమణ, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు.

Konda Laxman Bapuji is 104th Jayanti Celebrations