*అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్షం
*కార్యాలయాల తరలింపు అన్యాయం
*ప్రొఫెసర్ కోదండరామ్
మనతెలంగాణ/కొడంగల్ : నిజాం కాలం నాటి నుండి చారిత్రకమైన ప్రాంతంగా కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపుందని టిజేఎసి చెర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం రైతు అధ్యయన యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్‌లో జేఎసి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్ధానిక అంబేద్కర్ చౌరస్తాలో అయన అంబేద్కర్ చిత్ర పట్టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొడంగల్ నుండి ప్రభుత్వ కార్యలయాల తరలింపుపై అఖిల పక్షం నాయకులు అందించిన వినతి పత్రానికి అయన స్పందిస్తూ, నిజాం కాలంలో మున్సిపాలిటిగా కొడంగల్‌కు మంచి గుర్తింపు ఉండేదన్నారు. అనాడు జరిగిన రాష్ట్రల పునర్విభజనలో మున్సిపాలిటిని కాస్తా తాలుకాగా మార్చడం జరిగిందన్నారు. కాని ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా పునర్విభజన పెరుతో తాలుకా స్ధాయి నుండి మండల స్ధాయికి కొడంగల్ పేరును దిగచార్చిందని అయన అవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నుండి కార్యలయాల తరలింపుపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు అయన పేర్కొన్నారు. తరలించిన కార్యలయాలు తిరిగి రప్పించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జేఎసి ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని ప్రభుత్వనికి హెచ్చరించారు. రైతులు ఎక్కువగా సాగుచేస్తున్న పంటలు,పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందా?లేదా? ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడితో రైతులు ఏ మేరకు లభ్దిపోందుతున్నారనే ఆంశంపై టిజేఎసి రైతు అధ్యయణ యాత్రను చెపట్టిందని అయన తెలిపారు. అందులో భాగంగానే దౌల్తాబాద్ మండంలోని గోకఫస్లాబాద్‌లో ఇంటింటికి తిరిగి రైతుల నుండి సమాచారం సేకరించనున్నట్లు అయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఎసి నాయకులతో పాటు రవిందర్‌గౌడ్,యూసుఫ్,భీమరాజు,కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
కోదండరాంకు ఘన సన్మానం
బొంరాస్‌పేట : టీజేఏసీ రాష్ట్ర ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఆదివారం ఘనంగా సన్మానించారు. రైతు అధ్యయన యాత్రలో భాగంగా కోదండరాం దౌల్తాబాద్ మండలం గోకఫసల్‌వాద్, మద్దూర్ మండలం నిడ్జింత గ్రామాలకు విచ్చేస్తున్న సందర్భంగా మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో స్థానిక టీజేఏసీ నాయకులు పూలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇక్కడి ప్రాంత రైతుల సమస్యలను అధ్యయనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేందుకు కోదండరాం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేందుకు కోదండరాం నేతృత్వంలో అన్ని గ్రామాల్లో టీజేఏసీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ ప్రతినిధులు గౌరారం గోపాల్, టీజేఏసీ మండల ఛైర్మన్ శైలేందర్‌సింగ్ ఠాకూర్, తూంకుంట నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు.