Home తాజా వార్తలు కవి ముఖమే నా కాన్వాసు

కవి ముఖమే నా కాన్వాసు

Kondepudi Nirmala

 

కవిత్వానికి కొండేపూడి నిర్మల ఫోటోషాప్ ప్రయోగం

కవిత్వాన్ని రాస్తాం, బొమ్మ గీస్తాం, సినిమా తీస్తాం. మూడు భిన్న కళా రూపాలు. వ్యక్తీకరణ మార్గాలు. మరి కవి ముఖమే కాన్వాసుగా మారి కవిత్వానికి, పదచిత్రానికి అద్దం పట్టిందనుకోండి, ఎవరి కవిత్వానికి వారినే హీరోని చేసిందనుకోండి, అపుడు దాన్ని ఏమనాలి ? ఆ ప్రక్రియ ఎలా వుంటుంది ? కొండేపూడి నిర్మల ఈ సరికొత్త వ్యక్తీకరణ రూపంలో దూసుకుపోతోంది. అదేమిటో చూద్దాం

1. కవయిత్రిగా మీరు సుపరిచితమే, కానీ ఈ మధ్య ఫేస్ బుక్ లో చేస్తున్న గ్రాఫిక్ ప్రయోగమేమిటి ? ఆ ఆలోచన ఎలా వచ్చింది ? ఇది కూడా కవిత్వమే . కాకపోతే ఇక్కడ మీరు కవిత్వాన్ని గ్రాఫిక్ ఇమేజ్‌గా చూస్తారు. కవిని కవిత్వంతో కలిసి ఒక ఆర్ట్ ఫామ్ లోకి తీసుకురావడమే దీని ప్రత్యేకత. ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆంటే కేవలం వైవిధ్యం కోసమే. ఒక మూసలో పడి కొట్టుకుపోవడం ఎందుకోగాని నాకు చాతకాదు. కవిత్వంలో అప్సష్టత ఒక గుణం, దానివల్ల చదువరి కవిని వదిలి చాలా ఊహలు చేస్తాడు. అది నేను ఈ బొమ్మకి ఉ పయోగించాను. దీనివల్ల కవిత్వమే లేకుండా శుద్ధ వచనం రాసిన కవితకి కొత్త రూపం వచ్చింది.

సర్రియలిజం కవిత్వంలో కంటే ఆర్ట్ లో నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆ ఇష్టానికి రూపం ఇచ్చాను. ఇలస్టేషన్స్ క్యారికేచర్స్. కార్టూన్స్ తెలుసు కదా, కొన్ని యధాతధ రూపానికి, కొన్ని వ్యంగానికి గుర్తులుగా వుంటాయి. ఈ అన్నిటికి కలుపుకుంటూనే భిన్నంగా ఏదో చేయాలనుకున్న రూపమే ఇది. దీన్ని ఏమనాలో తెలియదు. ఫోటో ఆర్ట్ అనుకుందాం ప్రస్తుతానికి. ఇటువంటి ప్రయోగం తెలుగు లో ఎక్కడా చూడలేదు అని కొందరు అన్నారు. ఈ ప్రయోగం చేస్తున్నవారిలో మీరు మొదటి వారు, కాబట్టి టెక్నిక్ వదిలి ప్రయోగాన్ని ఆదరిస్తారు. అన్నారు ఆర్టిస్ట్ తల్లావఝల శివాజీ.

2. ఇంతకు ముందు చిత్రలేఖనంలో ప్రవేశం వుందా ? అందులో ఎందుకు కొనసాగలేదు ?
అవును కేవలం ప్రవేశమే వుంది. ఆగిపోయాను. కవిత్వలో పడ్డాను. దాని కాన్వాసు చాలక కధలు రాశాను. పత్రికల్లో పనిచెయ్యడం వల్ల కాలమ్స్ రా శాను. బొమ్మలు ఆపేసినందుకు లోపల ఏదో వెలి తి వుంది. అది పూడ్చుకోవడానికే ఇది చేస్తున్నానేమో తెలియదు. కంప్యూటర్ అనబడు ఈ ఎలక్ట్రానికి జంతువుని కాస్త మచ్చిక చేసుకుని ఇందులో వున్న పెయింట్ టూల్స్ వాడి గీతాభ్యాసం మొదలుపెట్టి ఇప్పటికీ పదిహేనేళ్ళవుతోంది. వంద రం గులు కలిపినా రాని కలర్ కాంబినేషన్ ఒక్క చిటికెలో రావడం చూసి హుర్రే అనిపించింది. ఓసారి కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లినప్పుడు తీసిన ఫోటోలు లైటింగ్ ఎక్కువై కొన్ని సరిగా రాలేదు.

సెర్చ్ ఇంజన్ ద్వారా వెతికి ఫోటోషాప్ అనే సాఫ్ట్ వేర్ ని ట్రయల్ బేసిస్ తో తీసుకుని ఫోటోలు ఎడిట్ చేశాను. బావుందన్నారు, ఆంతే ఇంక ప్రతి ఫోటో బాగుచెయ్యడం, బ్యాక్ గ్రండు మార్చడం స రదాగా చేశాను. కొన్నాళ్లయాక అవి బోర్ కొట్టి ఇ న్విటేషన్స్, విజిటింగ్ కార్డులు చేశాను. క్యారికేచ ర్ టైపులో అందర్నీ నవ్వించడానికి మిత్రుల ఫో టోలు చేశాను. అది బాగా హిట్టయింది. బంధువుల యింట్లో పెళ్లి ఫోటో ఆల్బమ్ లకి సమాతరంగా సరదా వ్యాఖ్యలతో ఫోటో ఆర్ట్ చేశాను. ఆవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మలకి ముందు వేసి న తప్పటడుగులు. అయితే ఇవన్నీ యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. కంప్యూటర్ మన సందేహాలు పూర్తిగా తీర్చదు. పోగుచేసిన సమాధానాల్లో నచ్చినవి ఏరుకొమ్మంటుంది. బైట కోర్సులో చేర డం చాలా ఖరీదైనపని.

3. బొమ్మలకి కవిత్వాన్ని వాహకంగా ఎలా తీసుకోవాలని అనిపించింది ?
అందరిలాగానే నేను కూడా ఫేస్ బుక్ ని సమాచా ర బట్వాడా మాధ్యమంగా వాడతాను. అనుకోకుం డా ఒకసారి ఒక కవిమిత్రుడి ఫోటో తీసుకుని అ తని సాహిత్య వ్యక్తిత్వానికి సంబందించి వ్యాఖ్యాని స్తూ ఫోటోతో బొమ్మ వేశాను. అది అది హిట్టవడంతో కొందరు తమ ఫోటోలు పంపారు. తర్వాత నా ఫ్రెండు సి.సుజాత సలహా ఇచ్చింది. కవుల్ని గురించి కవిత్వం తెలియని వాళ్ళకి నీ బొమ్మలు ఎలా అర్ధం కావాలి? కాబట్టి వారి కవిత్వాన్ని గురిం చి చెబుతూనే బొమ్మ గురించి రెండు మాటలు రాయి, అంది. అది నచ్చడంతో నా బొమ్మకి తగిన కవిత్వాన్ని కవి నుంచి తీసుకున్నాను. కొన్నిసార్లు కవితకి తగిన బొమ్మలు ఆలోచింఛీ వేశాను. ఇది పాటని బట్టి ట్యూను, ట్యూన్ని బట్టి పాట కట్టడం లాంటిదే. భలే రెస్పాన్స్ వచ్చింది. ఫేస్ బుక్ కిట కి ట లాడింది. సి రాంబాబు లాంటివాళ్లు దీన్ని ఫేస్ బుక్ సెన్సేషన్ అన్నారు. ప్రసాదమూర్తి అయితే ఏ రోజు ఎవర్ని ఏం చేశారో అని భయం వేస్తోంది తల్లీ, అని సెటైర్ చేశారు. కధా రచయిత్రుల ఫో టోలు కూడా ఆర్ట్ చేశాను.

4. నెగెటివ్ రెస్పాన్స్ ఎప్పుడు రాలేదా?
ఇప్పటికీ 130 దాకా బొమ్మలు వేశాను. ఒకే ఒక్క కవి ప్రతికూలంగా స్పందించాడు. ఒక నమస్కా రం చేసి మొత్తం కవుల లిస్టులోంచి అతని బొమ్మ తీసేశాను. మిగిలిన 129 మందినా ప్రయత్నానికి అభినందించారే తప్ప మరోలా అనుకోలేదు. ఎం దుకంటే ఇది వారి కవిత్వాన్ని గౌరవించడానికి చే సిన కృషే తప్ప మరోటి కాదని తెలుసు కదా.

5. ఇతర ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా ?
చిన్నవే. మా బొమ్మ ఇంకా ఎందుకు వేయలేదు ? ఆలస్యంగా ఎందుకు వేశారు ? వాళ్ళు మాకంటే జూనియర్లు కదా వారివి ముందుగా ఎందుకు వే శారు లాంటివి. కవులవే వేస్తారా ? రచయితలవి ఎందుకు వెయ్యరు ? యాక్టివిస్టుల్ని పట్టించుకోరా ? ఇలాంటివి.ఈ సందర్భంగా నేనొక విన్నపం రాసి ఫేస్ బుక్ లో పెట్టాను. ఇది ప్రాజెక్ట్ కాదు, స్వతంత్రంగా చేస్తున్నపని. కవుల్లో హైరార్కి నేను ఎప్పుడూ పట్టించుకొను. అది నా భావస్వేచ్చని దెబ్బతీస్తుంది. కవి త్వం చదివాక కవి పేరు చూసే అలవాటు నాకు వుంది.

ఇక సాంకేతికంగా చూస్తే కవి ఫోటో స్పష్టంగా, పిక్సలేట్ కాకుండా వుండాలి, ఆంటే 300 రిసల్యూషన్ వుండాలి. శాలువాలు, సూటు బూటు, పట్టు చీరలు నగలతో డాబుసరిగా వున్న ఫోటోలు సర్రియలిజం, భావ కవిత్వం తాలూకు పదచిత్రాలకు సరిపడవు. ఇలాంటి చాలా పరిమితులు, ఖ చ్చితమైన అభిప్రాయాలు నాకు వున్నాయి .

6. అన్నీ ఫోటోషాప్ అనే అంటారా ఇందులోనూ ప్రయోగాలు చేశారా ?
చేశాను. నేను మొదట వేసిన బొమ్మలు ఫోటోషాప్ బ్లెండింగ్ ఆప్షన్ అంటారు. ఆంటే అందులో కవిత్వాన్ని బొమ్మకట్టడానికి తీసుకున్న ప్రతీకల్లో కవికూడా వుంటాడు. ఆంటే మొత్తం బొమ్మలో అతను కూడా ఒక భాగం. ఇప్పుడు డబుల్ ఎక్స్ పోజర్ ఇ మేజెస్ వేస్తున్నాను. ఇందులో నేను ఎంపిక చేసుకున్నకవిత్వానికి ప్రతీకగా తీసుకున్న వాతావర ణం మొత్తానికి కవి ముఖం కాన్వాసుగా వుంటు ంది. ఇవి కాక desperation, పౌడర్ బ్లాస్ట్, ట్రాన్స్ ఫామ్, slic ed, splash, smoke, ౩d పాప్ ఔట్ లాంటివి కూడా వేశాను ఇది ఒక మహా సముద్రం. ఇందులో ఈదడమే త ప్ప గమ్యం కోసం వెతక్కూడదు.

7. దీనివల్ల మీరు సాధించినది ఏమిటి ?
నవ్వనంటే చెబుతాను. బాహ్యంగా అయితే నడుం నొప్పి, మెడకి పట్టీ -మానసికంగా మాత్రం అంతులేని సంతృప్తి దొరుకుతోంది. అలా ఒక వాక్యం పట్టుకుని, గీతలు చుట్టుకుంటూ ఉయ్యా ల ఊగడం మా గొప్ప మజాగా వుంది.

8. భవిష్యత్ ప్రణాళిక ఏమిటి ?
దీన్ని ముందు ఈ-బుక్ గా తేవాలి. ఇన్ని గ్రాఫిక్స్ బుక్‌గా అచ్చు వెయ్యాలంటే చాలా అవుతుంది ఎ గ్జిబిషన్ పెట్టమని కొందరు అంటున్నారు.ఈ పని నేను ఆంద్రజ్యోతిలో వున్నప్పుడు చేశాను. అది కేవలం కావూల్ స్వభావాలను గురించి టుంరీలు. కవిత్వం తీసుకోవాలని మొదట అనుకోలేదు. వాటికి అవి మచి బొమ్మలతో ప్రతి ఆదివా రం వచ్చేవి. ఒకరకంగా ఝరుక్ శాస్త్రి, శ్రీరమణ పేరడీలు స్ఫూర్తిగా

Kondepudi Nirmala Photoshop Experiment to Poetry