Home Default మహిళల మద్దతు టిఆర్ఎస్ కే : కొప్పుల ఈశ్వర్

మహిళల మద్దతు టిఆర్ఎస్ కే : కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar Elections Campaign In Huzurabadకరీంనగర్ : మహిళల సంపూర్ణ మద్దతు టిఆర్ఎస్ కే ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మహిళల కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం  జమ్మికుంటలో మహిళలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో మహిళలు ఏకమై అధికార టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటేయడం వల్ల ఎటువంటి లాభం లేదని, ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు తరలివచ్చిన మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సుధారాణి, సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ పి.టి.స్వామి, సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ప్రముఖులు కెంగర్ల మల్లయ్య,మహిళా సంఘానికి చెందిన ప్రముఖులు సింధూజరెడ్డి, మల్లీశ్వరి,పద్మజ,సుప్రజ, టిఆర్ఎస్ నాయకులు నాగరాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు