Friday, April 26, 2024

‘ఆచార్య’ టీజర్ కు డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

Koratala Siva Announces Acharya Teaser Release date

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘ఆచార్య’. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు కొరటాల శివ గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ నెల 29న ‘ఆచార్య’ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ధర్మస్థలి తలుపులు జనవరి 29న సాయంత్రం 4.05 నిమిషాలకు తెరుచుకుంటాయి’ అని చిన్న వీడయోను విడుదల చేశాడు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా, ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

https://twitter.com/sivakoratala/status/1354285558361559043?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1354285558361559043%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fsivakoratala2Fstatus2F1354285558361559043widget%3DTweet

Koratala Siva Announces Acharya Teaser Release date

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News