Home జగిత్యాల టిఆర్ఎస్ ఎంఎల్ఎ పిఎ గల్లంతు…

టిఆర్ఎస్ ఎంఎల్ఎ పిఎ గల్లంతు…

 

జగిత్యాల: కోరుట్ల టిఆర్ఎస్ ఎంఎల్ఎ విద్యాసాగర్ రావు పిఎ కాల్వలో గల్లంతయ్యారు. ధరూర్ సమీపంలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఎంఎల్ఎ పిఎ గిరీష్ తన స్నేహితులతో కలిసి ఈత కోసం అంతర్గాం శివారులోని ఎస్సారెస్పి కాల్వలోకి వద్దకు వెళ్లారు. అయితే, కాల్వలో దిగిన గిరీష్ కనిపించకుండాపోయాడు. గిరీష్ కు ఈత రాకపోవడంతో కాల్వ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అనుమానించిన స్నేహితులు చుట్టుపక్కవాళ్లకు చెప్పడంతో గిరీష్ కోసం స్థానికులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అంతర్గాం, థరూర్ ప్రాంతాల్లో కాలువ వెంబండి గిరీష్ ఆచూకి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

Korutla MLA Vidyasagar PA Drowned in SRSP Canal