Friday, April 19, 2024

నల్లగొండలో ఎంఎల్‌సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాను వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపారని కోటి రెడ్డి కొనియాడారు.

కోటి రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. కోటి రెడ్డిని గెలిపించి సిఎం కెసిఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని కోరారు.

ఇచ్చిన మాట నిలుపుకున్న గొప్ప నాయకుడు సిఎం కెసిఆర్ అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News