Home జాతీయ వార్తలు వందేళ్ల బీహార్ విధాన సభ భవన్ వేడుకల్లో రాష్ట్రపతి కోవింద్

వందేళ్ల బీహార్ విధాన సభ భవన్ వేడుకల్లో రాష్ట్రపతి కోవింద్

Kovind attends to 100 yrs of bihar vidhan sabha bhavan

 

పాట్నా: బీహార్ విధాన సభ భవన్ శతవార్షికోత్సవాన్ని పురస్కరించకుని గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని ఈ సందర్భంగా ఒక బోధి మొక్కను నాటారు. శాసనసభ, శాసన మండలి భవనాలతో విశాలమైన ఆవరణలో నిర్మితమైన ఈ ప్రాంగణం ఎన్నో చారిత్రాత్మక శాసనాల రూపకల్పనకు, చర్చలకు వేదికగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి విధాన సభ భవన్ ప్రాంగణంలో ఒక స్మారక స్తంభానికి శంకుస్థాపన చేశారు. వందేళ్ల విధాన సభ భవనమంత ఎత్తులో ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తామని, దానిపైన గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం లభించిన బోధి వృక్షం లోహ నమూనాను ప్రతిష్టిస్తామని అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. అనంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మూలాలపై శాసనసభలో చర్చ అనే అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్ ఉపన్యసించారు.