Home తాజా వార్తలు వర్షాలు లేకున్నా హర్షాలు

వర్షాలు లేకున్నా హర్షాలు

Krishna-Basin

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లో పెద్దగా వర్షం లేకున్నా, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు జలకళ వచ్చింది. వరాలజల్లులా జలాలు వచ్చి, బేసిన్‌లోని ఆయకట్టుకు ఆశలు కల్పించింది. ప్రస్తుత సీజన్‌లో జూరాలకు ఏకంగా 766 టిఎంసిల నీళ్లు వచ్చాయి. 9.6 టిఎంసిల సామ ర్థం ఉన్న జూరాలలో వచ్చిన నీటిని వ చ్చినట్లే అన్ని గేట్లు తెరిచి, దిగువకు వదిలారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు 800 టి ఎంసిల జలాలు వచ్చాయి. నాగార్జునసాగర్‌కు గత పదేళ్లలో తొలిసారిగా 527 టిఎంసిల నీరు వచ్చింది. పులిచింతలకు సైతం 312 టిఎంసిల నీరు రాగా, ప్రకాశం బ్యారేజి డ్యాంను దాటి 300 టిఎంసిలకు జలాలు సముద్రంలోకి వదిలారు. నీటి కరవు అణువణువునా ఉంటుందనుకున్న కృష్ణా నది నుంచి 300 టిఎంసిల నీళ్లు సముద్రంలోకి వెళ్లడం ఇటీవలి కా లంలో ఇదే మొదటిసారని అంటున్నారు.

గత మూడేళ్ల క్రితం కూడా ఎగువన శ్రీశైలం, దిగువన పులిచింతల బ్యారేజికి నీరొచ్చినా, మధ్యలో ఉన్న నాగార్జునసాగర్‌కు ఎటువంటి ప్రవాహం లేకుండా కనీస నీటిమట్టం కూడా నిర్వహించలేని దుస్థితిని ఎదుర్కొంది. ఇదిలా ఉండగా ప్రస్తుత వాటర్ ఇయర్‌లో ఆల్మట్టి రిజర్వాయర్‌కు 800 టిఎంసిల నీళ్లు, నారాయణపూర్‌కు 720 టిఎంసిల నీళ్లు వచ్చాయి. ఇదేవిధంగా భీమా నదిపై ఉన్న ఉజ్జయిని డ్యాంకు 148 టిఎంసిల నీరు రాగా, తుంగభద్ర జలాశయానికి 180 టిఎంసిలు వచ్చాయి. వాటర్ ఇయర్ ప్రారంభానికి ముందు దాదాపుగా అన్ని జలాశయాల్లో కనీస నీటినిల్వలే ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఉజ్జయిని, తుంగభద్ర డ్యాంలలో కనీస నీటినిల్వలు కూడా లేవు. పులిచింతలలో కనీసం ఒక్క టిఎంసి నీరు సైతం లేదు. కానీ ఎగువన కురిసిన వర్షాలతో ఈ జలాశయాల్లో ఉన్న నీటిలోటును పూడ్చడమే కాకుండా, లక్షలాది క్యూసెక్కులు తరలివచ్చి, అన్ని గేట్లను చాలా రోజుల తర్వాత తెరిచిపెట్టి, సముద్రంలోకి నీటిని వదలాల్సిన స్థాయిలో ఉధృత ప్రవాహం ఈ సీజన్‌లో వచ్చింది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహం తగ్గినా, పూర్తిగా ఆగలేదు.

krishna basin reservoirs storage levels Fulfill