Saturday, April 20, 2024

భారత్‌కు ఐదో స్వర్ణం..

- Advertisement -
- Advertisement -

Krishna Nagar clinches India's 5th Gold medal at Paralympics

 

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్‌మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

సుహాస్ యతిరాజ్‌కు రజతం

టోక్యో పారాలింపిక్స్‌ల్లో భారత్‌కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్ 4 విభాగం ఫైనల్లోప్రపంచ నంబర్ వన్, ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్ రజతంతో ఇంటికి తిరుగు పయనమయ్యారు. సుహాస్ యతిరాజ్ ఉత్తరప్రదేశ్‌లో ఐఎఎస్ అధికారిగా పని చేస్తున్నారు.

పతాకధారిగా అవని

విశ్వక్రీడల్లో మనదేశం తరఫున స్వర్ణం సాధించిన తొలి మహిళా అథెట్‌గా రికార్డు సృష్టించిన అవని.. టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఆదివారం జరుగనున్న కార్యక్రమంలో అవని త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందు నడవనుండగా.. భారత్ నుంచి 11 మంది ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News