Home తాజా వార్తలు అభిమానులకు గుడ్ న్యూస్.. డార్లింగ్ ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ వచ్చింది

అభిమానులకు గుడ్ న్యూస్.. డార్లింగ్ ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ వచ్చింది

 

 

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పడు ప్రభాస్ పెళ్లికోసం ఆయన అభిమానులు అంతగానే ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ గా ఉన్న ప్రభాస్‌ ఎపుడు పెళ్లి చేసుకుంటాడని, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడని విపరీతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను ప్రభాస్, స్వీటీ ఇద్దరూ ఖండించడంతో డార్లింగ్ పెళ్లిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రభాస్‌ పెళ్లి గురించి అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్‌, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని ఆమె స్పష్టం చేశారు. ప్రభాస్‌ పెళ్లి కోసం మేం కూడా ఎదురుచూస్తున్నామని, పెళ్లి కూతురు విషయంలో వచ్చిన పుకార్లకు మేం బాగా నవ్వుకున్నామని తెలిపారు. మా కుటుంబంలో కలిసిపోయే తగిన అమ్మాయి కోసం చూస్తున్నామని ఈ సందర్భంగా ఆమో అభిమానులకు స్పష్టతనిచ్చింది.

కాగా, ఇటీవల వచ్చిన సాహో సినిమాతోనూ డార్లింగ్ సత్తా చాటాడు. మొదటి రోజునుంచే నెగిటీవ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ పై తన పంజా విసిరాడు. ముఖ్యంగా హిందీలో రూ.150 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ స్టార్ హీరోలకు ఝలక్ ఇచ్చాడు.

Krishnam Raju’s Wife Clarified on Prabhas Marriage