Friday, April 19, 2024

గొప్ప గౌరవంగా భావిస్తున్నా

- Advertisement -
- Advertisement -

Kriti Sanon as Sita in movie Adipurush

 

ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో సీతగా కనిపించబోతోంది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. అయితే ఇలాంటి పాత్రలో తాను నటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది కృతి. కానీ సీతగా నటించి మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. అది ఒక సవాల్. అందుకే.. సీతపాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు శిక్షణ తీసుకుంటోందట కృతి. నడక, నడత మొదలు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటోందట. ఇక తెలుగు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ ట్యూటర్ ను కూడా నియమించుకుందట. ఆ విధంగా.. తెలుగు డైలాగ్స్ కూడా స్వయంగా చెప్పేందుకు సిద్ధమవుతోంది కృతి సనన్. ఇక ‘ఆదిపురుష్’లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ సినిమాలో లణుడి క్యారెక్టర్లో సన్నీ సింగ్ నిజ్జర్ కనిపించబోతున్నారు. రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ భారీగా ఉంటుందని సమాచారం. చిత్రీకరణ త్వరగా పూర్తి చేసి ఈ వర్క్ మీదనే ఎక్కువ సమయం కేటాయించబోతున్నాడట దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News